కెజిఎఫ్ చిత్రంతో హీరో యాష్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం అభిమానులంతా కెజిఎఫ్ చాప్టర్ 2 కోసం ఎదురుచూస్తున్నారు. ఆ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. ఇండియా ఉండగా నటి రాధికా పండిట్, హీరో యష్ 2016లో వివాహం చేసుకున్నారు. 

ఈ జంటకు మొదటగా పాప జన్మించింది. తమ కుమార్తెకు యష్, రాధికా పండిట్ ఆర్య అని నామకరణం చేశారు. రాధికా పండిట్ తరచుగా ఆర్య ఫోటోలని వీడియోల్ని అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా రాధికా పండిట్ సోషల్ మీడియాలో తన కుమార్తె పాత వీడియో అభిమానులతో పంచుకుంది. 

ఏం పోయేకాలం రా మీకు.. బన్నీ, మహేష్ సినిమాలపై సంచలన కామెంట్స్!

ఆర్య విశేషాలు మీకు చెప్పి చాలా రోజులు గడుస్తోంది. మీరంతా అడుగుతున్నారు. అందువల్ల ఈ త్రోబ్యాక్ వీడియో షేర్ చేస్తున్నట్లు రాధిక తెలిపింది. ఈ వీడియోలో తల్లీ కూతుళ్ళ సరాదా నెటిజన్లని ఫిదా చేస్తోంది. ఆర్యకు రాధికా పండిట్ గోళ్లు కత్తిరిస్తున్న వీడియో అది. ఆర్య మారం చేయకుండా రాధికా చాలా బాగా హ్యాండిల్ చేసింది. గోళ్లు కత్తిరించే సమయంలో రాధిక తన కూతురితో సరదాగా 'టక్' అనే శబ్దం చేసింది. దీనితో ఆర్య మారం చేయకపోగా.. నవ్వుతూ ఎంజాయ్ చేసింది. 

రాధిక ఆ శబ్దం చేసిన ప్రతి సారి ఆర్య నవ్వుల్లో మునిగిపోయింది. ఈ క్యూట్ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి. గత ఏడాది అక్టోబర్ లో రాధికా పండిట్, యష్ దంపతులకు మగ బిడ్డ జన్మించాడు. యష్ క్రేజీ స్టార్ గా బిజీ అయిపోవడంతో రాధిక తన పిల్లల భాద్యత చూసుకుంటోంది.