సంక్రాంతికి విడుదలైన సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. కానీ ఈ రెండు చిత్రాలు సాధించిన వసూళ్ల విషయంలో పెద్ద హడావిడి జరుగుతోంది. రెండు చిత్రాలు 100 కోట్లకు పైగా షేర్ సాధించాయి. 

అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రానికి ఇంకాస్త అధికంగా వసూళ్లు వస్తున్నట్లు ట్రేడ్ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఈ చిత్రం 150 కోట్ల షేర్ కు చేరువైనట్లు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగానే అల వైకుంఠపురములో చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ మీట్స్ నిర్వహిస్తూ మరింత ప్రచారం కల్పిస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర యూనిట్ పదే పదే నాన్ బాహుబలి ఇండస్ట్రీ రికార్డ్ అంటూ ప్రచారం చేసుకుంటుండడం విమర్శలకు దారితీస్తోంది. 

ఇక మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ వరుసగా సక్సెస్ మీట్స్ నిర్వహించనప్పటికీ.. నాన్ బాహుబలి ఆల్ టైం రికార్డ్ అని వాళ్ళు కూడా ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఇద్దరు హీరోల మధ్య పెద్ద యుద్ధమే సాగుతోంది. దీనిపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. 

ఆయన సోషల్ మీడియాలో సెటైరికల్ వీడియో రిలీజ్ చేశారు. మహేష్, అల్లు అర్జున్ మాస్క్ లు చూపిస్తూ అభిమానులు గొడవపడుతున్నట్లు చూపించారు. నాన్ బాహుబలి రికార్డ్ మాదే.. కాదు మాది అంటూ బన్నీ, మహేష్ ఫ్యాన్స్ కొట్టుకుంటున్నట్లు సరదాగా వీడియో రూపొందించారు. 

RRR లో మహేష్, అమితాబ్.. రాజమౌళి న్యూ ప్లాన్!

రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. మహేష్ బాబు, అల్లు అర్జున్ హ్యాపీగా ఉన్నారు. మధ్యలో మీకు ఏం పోయే కాలం రా అంటూ తమ్మారెడ్డి ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కు చురకలు అంటించారు. ఆ రెండు చిత్రాలు బాహుబలి తర్వాతే. బాహుబలి ఇప్పటికి నెం 1. ఆ చిత్ర రికార్డ్ ని బ్రేక్ చేసిన రోజున మీరంతా మాట్లాడండి అని తమ్మారెడ్డి  బన్నీ, మహేష్ ఫ్యాన్స్ కు సూచించారు. 

తమ్మారెడ్డి భరద్వాజ తరచుగా సినీ రాజకీయ, ఇతర సామాజిక అంశాలపై యూట్యూబ్ లో వీడియోలు పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు చిత్రం జనవరి 11న రిలీజ్ కాగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన అల.. వైకుంఠపురములో చిత్రం 12 న విడుదలయింది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల వసూళ్ల గురించి ఇండస్ట్రీలో, అభిమానుల్లో పెద్ద చర్చే జరుగుతోంది.