ఇటీవల టాలీవుడ్ సెలబ్రిటీల ఇళ్లపై జీఎస్టీ నిఘా విభాగం బృందాలు తనిఖీలు చేపట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత సురేష్ బాబు, హీరో నాని, యాంకర్ సుమ, అనసూయ, నటి లావణ్య త్రిపాఠి ఇలా చాలా మంది సెలబ్రిటీలపై జీఎస్టీ రైడ్స్ జరిగాయి.

క్యాబ్ లో భయంకర అనుభవం.. వణికిపోయా.. హీరోయిన్ కామెంట్స్

అవి మర్చిపోక ముందే తాజాగా నటి రష్మిక ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. కొడుకు జిల్లా విరాజ్ పేట్ లో లోని రష్మిక ఇంట్లో దాడులు కొనసాగుతున్నాయి. బ్యాంక్ ఖాతాలు, ఆస్తులకు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం రష్మిక ఔట్ డోర్ షూట్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

'గీత గోవిందం' సినిమాతో యూత్ లో క్రేజ్ తెచ్చుకున్న ఈ బ్యూటీ వరుస సినిమాలతో టాలీవుడ్ లో బాగా పాపులర్ అయింది. అప్పటివరకు కుర్ర హీరోలతో నటించిన ఈమెకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశం వచ్చింది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై హిట్ టాక్ దక్కించుకుంది.

వరుసగా స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతుంది. తన తదుపరి సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ తో కలిసి జత కట్టబోతుంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాలను కేరళలో చిత్రీకరిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.