టాలీవుడ్ లో గ్లామర్ రోల్స్ నటించిన తాప్సి కొంత కాలానికి బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. బాలీవుడ్ లో తాప్సికి మంచి అవకాశాలే వస్తున్నాయి. తాప్సి బాలీవుడ్ లో వరుసగా సందేశాత్మక చిత్రాల్లో నటిస్తోంది. గత ఏడాది తాప్సి ప్రధాన పాత్రలో నటించిన బద్లా చిత్రం విజయం సాధించింది. 

ప్రస్తుతం తాప్సి కొన్ని ఆసక్తికర చిత్రాల్లో నటిస్తోంది. అందులో ఒకటి 'థప్పడ్'. అనుభవ్ సుశీల్ సిన్హా దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో సెన్సేషనల్ గా మారిపోయింది. అందుకు కారణం ఈ చిత్రంలోని కథాంశమే. భర్త పార్టీలో చెంప దెబ్బ కొట్టాడనే కారణంగా తాప్సి విడాకుల అప్లై చేస్తుంది. పావైల్ గులాటి ఈ చిత్రంలో తాప్సి భర్తగా నటిస్తున్నాడు. 

ఏం పోయేకాలం రా మీకు.. బన్నీ, మహేష్ సినిమాలపై సంచలన కామెంట్స్!

మహిళల ఆత్మాభిమానం అనే సందేశాత్మక అంశతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఈ చిత్రంపై ప్రస్తుతం బిటౌన్ లో ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. హిందీలో అర్జున్ రెడ్డి రీమేక్ గా తెరకెక్కిన కబీర్ సింగ్ చిత్రం ఘనవిజయం సాధించింది. ఆ చిత్రానికి కౌంటర్ గా  థప్పడ్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారా అని మీడియా ప్రశ్నించగా తాప్సి సమాధానం ఇచ్చింది. 

4 గంటలు మాత్రమే.. పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫ్లైట్ గురించి నాదెండ్ల క్లారిటీ!

ఇది కబీర్ సింగ్ చిత్రానికి కౌంటర్ కాదు. మీరు అడిగిన ప్రశ్నకు నాకు బాధగా ఉంది. మరో చిత్రానికి కౌంటర్ గా మేము ఎందుకు సినిమా చేస్తాం. దర్శకుడు ఈ కథని కబీర్ సింగ్ విడుదల కాక ముందే రాసుకున్నారు అని తాప్సి సమాధానం ఇచ్చింది. కబీర్ సింగ్ చిత్రంలో హీరో హీరోయిన్ ని పలుమార్లు చెంపదెబ్బ కొడతాడు. అయినా హీరోయిన్ సర్దుకుపోతున్నట్లు చూపించారు. ఈ అంశం వివాదంగా మారిన సంగతి తెలిసిందే.