నిజ జీవితంలో దిల్ రాజు ఇద్దరు పిల్లలకు తాత. అయితే ఆయన్ను చూసిన వారు ఎవరూ తాత అయ్యే వయస్సు ఉందనుకోరు. ఆయన హెల్దీ లైఫ్ స్టైల్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, తరుచుగా స్పాస్ ని విజిట్ చేయటం ఆయన్ని ఆరోగ్యంగా,యువకుడులా ఉంచుతోంది. ఈ నేపధ్యంలో ఆయన మరో వివాహం చేసుకోవటానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఆయన భార్య అనిత కొద్ది సంవత్సరాల క్రితం హార్ట్ ఎటాక్ తో మరణించారు. అప్పటి నుంచి ఆయన పూర్తి గా సిని బిజినెస్ పైనే దృష్టి పెట్టి పర్శనల్ లైఫ్ ని పట్టించుకోలేదు.

కానీ తనకు అత్యంత సన్నిహితులైన వారి సలహా మేరకు ఆయన త్వరలో ద్వితీయ వివాహం చేసుకోవటానికి సిద్దపడుతున్నట్లు సమాచారం. కెరీర్ పరంగానూ ఆయన దిల్ రాజు మంచి ఫామ్ లో ఉన్నారు. సంక్రాంతికి డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన రెండు చిత్రాలు సరిలేరు నీకెవ్వరూ, అల వైకుంఠపురములో ...మంచి లాభాలు తెచ్చిపెట్టాయి. ఈ నేపధ్యంలో పర్శనల్ లైఫ్ లో ఏర్పడ్డ అగాధాన్ని ఆయన పూడ్చాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఇక దిల్ రాజు ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ళు పూర్తయింది. ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించారు. కానీ ఒక్క సినిమాను కూడా రీమేక్ చేయలేదు. అయితే 2020లో మాత్రం దిల్ రాజు స్ట్రాటజీ మార్చి... చేసి నిర్మించిన ఫస్ట్ రీమేక్ జాను. 96 చిత్రాన్ని చెన్నై వెళ్లి చూసొచ్చి, తెగ నచ్చేయడంతో తన నియమాన్ని పక్కన పెట్టేసి నిర్మించాడు. ఈ చిత్రం  మొన్న శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ కోసం పింక్ రీమేక్ బాధ్యతలను అందుకున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ చిత్రం మే 15న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

40 ఏళ్ల వయసులో తల్లైన హీరోయిన్లు.. ఇంత ఆలస్యం కావడానికి కారణం ఇదే!

ఇదిలా ఉంటే ఈ సంవత్సరం దిల్ రాజు ..హిందీ పరిశ్రమలోనూ నిర్మాతగా అడుగు పెడుతున్నారు.  తెలుగులో గతేడాది విడుదలై సూపర్ డూపర్ హిట్ అయిన జెర్సీ చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఇటీవలే కబీర్ సింగ్ రీమేక్ తో తిరిగి హిట్ ట్రాక్ లో పడ్డ షాహిద్, జెర్సీ రీమేక్ తో మరో విజయాన్ని అందుకోవాలని చూస్తున్నాడు.

మరీ ఇంతలా చెడిందా.. పవన్ పై అలీ తీవ్ర వ్యాఖ్యలు ?