దర్శక ధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి చిత్రంతో రాజమౌళి విశ్వఖ్యాతిని గడించారు. దీనితో బాహుబలి తర్వాత రాజమౌళి చిత్రం ఏంటని దేశం మొత్తం ఎదురుచూస్తున్న తరుణంలో ఎన్టీఆర్, రాంచరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని ప్రకటించారు. 

1920 బ్రిటిష్ కాలం నేపథ్యంలో.. చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీంగా నటించబోతున్నారని రాజమౌళి ప్రకటించగానే అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ప్రస్తుతం ఆ ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఓ సారి ఈ చిత్ర విడుదల వాయిదా పడింది. ముందుగా ఈ చిత్రాన్ని జులై 30న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. 

రిలీజ్ విషయంలోనే కాకుండా కాస్టింగ్ విషయంలో కూడా రాజమౌళికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ముందుగా ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు హీరోయిన్ గా డైసీ ఎడ్గార్ జోన్స్ అనే ఫారెన్ నటిని ఎంపిక చేసుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆమె ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకుంది. ఆ తర్వాత ఒలీవియా మోరిస్ అనే నటిని ఎన్టీఆర్ కి జోడిగా సెట్ చేశారు. 

ప్రియుడితో బ్రేకప్.. నాకు మంచే జరిగింది.. 'వరల్డ్ ఫేమస్ లవర్' హీరోయిన్

ఒక సమస్య తీరిందనుకుంటే రాజమౌళికి మరో చిక్కు వచ్చిపడింది. తాజాగా రాంచరణ్ కు జోడిగా సీత పాత్ర కోసం ఎంపిక చేసిన అలియా భట్ ఈ చిత్రం నుంచి తప్పుకునే అవకాశాలు ఉన్నట్లు ఊహాగానాలు జోరందుకున్నాయి. అలియా భట్ ఎంతటి బిజీ స్టారో చెప్పనవసరం లేదు. 

కరోనాని లెక్క చేయని రకుల్.. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేసిందంటే!

అలియా భట్ చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఈ చిత్రానికి డేట్స్ ఇచ్చింది. కానీ ప్రారంభంలో ఆర్ఆర్ఆర్ షూటింగ్ వాయిదాపడడంతో అలియా భట్ పై ఈ ప్రభావం పడింది. తిరిగి డేట్స్ అడ్జెస్ట్ చేయాలనీ అలియా ప్రయత్నిస్తున్నా కుదరడం లేదట. ఆర్ఆర్ఆర్ షూటింగ్ ప్రారంభమై ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అలీ భట్ పార్ట్ ప్రారంభం కాలేదు. ఆమె షూటింగ్ కే హాజరు కాలేదు. దీనితో అలియా ఆర్ఆర్ఆర్ నుంచి తప్పుకునే ఆలోచనలో ఉన్నట్లు టాక్. మరి రాజమౌళి ఈ సమస్యని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి..