విదేశీ మోడల్స్, నటీమణులకు భారత చిత్ర పరిశ్రమ మంచి వేదికవుతోంది. అమీ జాక్సన్ లాంటి హీరోయిన్స్ భారత చిత్రాల ద్వారా స్టార్స్ గా ఎదిగినవాళ్ళే. ప్రస్తుతం యంగ్ బ్యూటీ ఇజా బెల్లె సౌత్ లో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇజా బెల్లె మిస్టర్ మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి తెలుగు చిత్రాల్లో నటించింది. 

ఇండియాలో మోడలింగ్ చేస్తున్నప్పుడు కరీనా కపూర్ దృష్టిలో పండిందట. అలా తలాష్ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని ఇజా బెల్లె చెబుతోంది. ఇజా బెల్లె బ్రెజిల్ కు చెందిన యువతి. పుట్టి పెరిగింది అంతా బ్రెజిల్ లోని జొం పెసవా అనే నగరంలోనే అని ఇజా బెల్లె తెలిపింది. 

కరోనా ఎఫెక్ట్: ఇదే మంచి ఛాన్స్ అంటూ హీరోయిన్ ట్వీట్.. విరుచుకుపడ్డ నెటిజన్స్

నా చదువు పూర్తయ్యే సమయానికి మా కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. నేను కూడా ఏదో ఒక వృత్తిని ఎంచుకుని సంపాదన మొదలుపెట్టాల్సిన పరిస్థితి. అలాంటి తరుణంలో ఇండియాలో మోడలింగ్ లో అవకాశాల గురించి తెలుసుకున్నా. ఇండియాకు వెళ్లే ఆలోచనని మా కుటుంబ సభ్యుల ముందు ఉంచినప్పుడు వారు అంగీకరించలేదు. 

త్వరగానే తిరిగి వచ్చేస్తా అని చెప్పి ఇండియాకు వచ్చా. ఇండియాలో మోడలింగ్ ప్రారంభించిన తర్వాత సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా మిస్టర్ మజ్ను, వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రాల్లో నటించానని ఇజా బెల్లె తెలిపింది. చదువుకునే రోజుల్లో ఓ వ్యక్తితో కొంతకాలం డేటింగ్ చేశా. ఆ తర్వాత విభేదాల కారణం విడిపోయాం. అతడితో వినిపోవడం నా కెరీర్ కు మంచే జరిగింది అని ఇజా బెల్లె తెలిపింది. 

ఇండియాలో వివాహ వ్యవస్థ చాలా బలంగా ఉంటుంది. ఇక్కడి సాంప్రదాయాల్లోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. కానీ మరో మూడేళ్ళ వరకు పెళ్లి ఆలోచన లేదు అని ఇజా బెల్లె తెలిపింది.