కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైరస్ ఒకరినుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే చైనాని కోలుకోలేని దెబ్బ తీసిన కరోనా ప్రస్తుతం అమెరికా, ఇటలీ, ప్రాన్స్ దేశాల్లో కల్లోలం సృష్టిస్తోంది. ఇండియాలో కూడా 140కి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 

దీనితో కేంద్రప్రభుత్వంతో పాటు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అలెర్ట్ అయ్యాయి. నివారణ చర్యల్లో భాగంగా పాఠశాలలు, సినిమా హాళ్లు లాంటి జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాలని ప్రభుత్వం మూసివేస్తోంది. టాలీవుడ్ లో పలు చిత్రాల షూటింగులు కూడా నిలచిపోయాయి. 

హైపర్ ఆది పంచ్.. నాగబాబు 'అదిరింది'కి మామూలుగా ఇవ్వలేదుగా

ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల్లో ఎవరూ సాహసం చేసే ప్రయత్నం చేయడం లేదు. కానీ హాట్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం కరోనాని కూడా లెక్క చేయడం లేదు. తాజాగా రకుల్ ప్రీత్ సింగ్ ఓ వాణిజ్య ప్రకటనకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంది.

దీనిపై రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. ఈ షూటింగ్ ని ముందుగా షెడ్యూల్ చేశాం.. వాయిదా వేయలేని పరిస్థితి. అందుకే షూటింగ్ లో పాల్గొంటున్నా. కానీ మా టీం మొత్తం తగు జాగ్రత్తలు తీసుకుంటోంది. కరోనా వైరస్ వ్యాపిస్తున్నందున మా టీం అన్ని రకాల ప్రికాషన్స్ తీసుకుంటున్నాం అని రకుల్ తెలిపింది. సెట్ లోకి ఎంటర్ అయ్యే ముందే ప్రతి ఒక్కరికి జ్వరాన్ని కొలిచే పరికరాలతో టెస్ట్ చేస్తున్నారు అని రకుల్ చెప్పుకొచ్చింది.