మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నుంచి రాబోతున్న చిత్రం అల వైకుంఠపురములో. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అందాల తార పూజా హెగ్డే జంటగా నటించారు. ఈ సంక్రాంతికి జనవరి 12న అల వైకుంఠపురములో చిత్రం రిలీజ్ కాబోతోంది. దీనితో త్రివిక్రమ్, అల్లు అర్జున్ ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. 

అల వైకుంఠపురములో చిత్ర విశేషాల్ని వెల్లడిస్తున్నారు. ఇటీవల విడుదలైన అల వైకుంఠపురములో చిత్ర ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అల్లు అర్జున్ పెర్ఫామెన్స్, త్రివిక్రమ్ డైలాగులు ప్రేక్షకులని అలరిస్తున్నాయి. ముఖ్యంగా మహిళలని ఉద్దేశించిన త్రివిక్రమ్ రాసిన డైలాగ్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. 'ఈ ప్రపంచంలో దేన్నైనా పుట్టించగలిగే శక్తి ఇద్దరికే ఉంది.. ఒకటి ఈ నేలకి.. రెండు వాళ్ళకి' అని అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

ఈ డైలాగ్ గురించి చెబుతూ త్రివిక్రమ్ ఇటీవల తెలంగాణాలో జరిగిన దిశా సంఘటన గురించి ప్రస్తావించారు. దిశా సంఘటన తర్వాత ప్రస్తుతం పరిస్థితులకు ఆ డైలాగ్ చాలా అవసరం అనిపించిందని త్రివిక్రమ్ అన్నారు. హీరో ముందు మహిళలని అగౌరవపరిచే సన్నివేశంలో ఈ డైలాగ్ వస్తుందని అన్నారు. దిశా సంఘటన గురించి విన్న తర్వాత మూడు రోజుల పాటు షాక్ లోనే ఉన్నానని త్రివిక్రమ్ అన్నారు. 

అమరావతి సెగ: మహేష్ బాబు ఇంటి ముందు ధర్నా

ఆ సంఘటన తర్వాత చాలా భయం వేసింది అని అన్నారు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది.థమన్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ గా నిలిచాయి. సీనియర్ నటి టబు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించింది. నివేత పేతురాజ్, హీరో సుశాంత్ కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారు.