ఈ ఏడాది మహర్షి చిత్రంతో ప్రేక్షకులని అలరించిన సూపర్ స్టార్ మహేష్ వచ్చే ఏడాది సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు చిత్రంతో సందడి చేయబోతున్నాడు. ఈ చిత్రంతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. 

మహేష్ ఈ చిత్రంలో మేజర్ అజయ్ కృష్ణగా ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా సరిలేరు నీకెవ్వరు తర్వాత మహేష్ బాబు నటించే సినిమా గురించి ఆసక్తికర వార్తలు వస్తున్నాయి. సాధారణంగా మహేష్ సినిమాలకు సంబంధించిన ఏదైనా అధికారిక ప్రకటన వెలువడితే సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటుంది. 

మహేష్ పోస్ట్ పై స్పందించిన కమల్!

కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకుండానే మహేష్ నెక్స్ట్ మూవీ గురించి ఓ వార్త ట్విట్టర్ లో దూసుకుపోతోంది. 'SSMB27' అనే హ్యాష్ ట్యాగ్ తో మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఈ హ్యాష్ ట్యాగ్ ఇంతగా ట్రెండింగ్ లో ఉండడానికి కారణం ఉంది. 

మహేష్ తదుపరి చిత్రం గురించి వార్త అలాంటి ఇలాంటి వార్త కాదు. మహేష్ బాబు తదుపరి చిత్రం భారీ బడ్జెట్ లో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కబోతోందని సమాచారం. కెజిఎఫ్ చిత్రంతో దేశం దృష్టిని ఆకర్షించిన ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మహేష్ కోసం ఓ కథ సిద్ధం చేశాడట. ఇటీవల ఆ కథని వినిపించగా మహేష్ గ్రీన్ సిగ్నల్ లభించినట్లు తెలుస్తోంది. 

త్రివిక్రమ్, మహేష్, దేవిశ్రీ.. ఈ ముగ్గురికీ ఏమైంది.. విభేదాలకు ఇదే నిదర్శనం?

ఈ చిత్రంలో మహేష్ కు జోడిగా బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు టాక్. ఏ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనిల్ సుంకర నిర్మించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి క్రేజీ న్యూస్ బయటకు రావడంతో మహేష్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కానీ దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. 

చాలా రోజులుగా ప్రశాంత్ నీల్ మహేష్ బాబు, ఎన్టీఆర్ లాంటి తెలుగు హీరోలతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ చాప్టర్ 2ని ఫినిష్ చేసే పనిలో ఉన్నాడు.