లోకనాయకుడు కమల్ హాసన్ ఇటీవల తన 65వ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న సంగతి తెలిసిందే. అలానే ఆయన సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి అరవై ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా ఆయనకి శుభాకాంక్షలు చెప్పారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్విట్టర్ వేదికగా కమల్ కి విషెస్ చెప్పారు. ''కమల్ హాసన్ సర్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇండియన్ సినిమాకి మీరు అరవై ఏళ్లుగా అసాధారణమైన సేవలు చేస్తున్నారు. ఇది మామూలు విషయం కాదు.. మీరు ఎందరికి స్పూర్తినిస్తున్నారు. మీరు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా..'' అంటూ మహేష్ రాసుకొచ్చాడు.

ప్రశంసలతో ముంచెత్తిన మహేష్ బాబు.. 60 ఏళ్లుగా అంటే మాటలు కాదు సర్!

తాజాగా ఈ ట్వీట్ కి కమల్ స్పందించారు. మహేష్ కి ధన్యవాదాలు చెబుతూ.. ''మహేష్ గారు.. మీరు కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గానే కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు సూపర్ స్టార్ గా ఎదిగారు.  మీ విషెస్‌ను హృదయపూర్వకంగా స్వీకరిస్తున్నా. మీకు ఎప్పుడూ శుభం కలగాలని కోరుకుంటున్నా'' అంటూ బదులిచ్చారు.

దీనికి మళ్లీ మహేష్ స్పందిస్తూ.. ''ధన్యవాదాలు సర్. మీపై ప్రేమ, గౌరవం ఎప్పుడూ ఉంటాయి'' అని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం అనిల్  రావిపూడి దర్శత్వంలో 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నాడు.సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.