కుర్రకారులో నడుము సుందరి ఇలియానాకు తిరుగులేని క్రేజ్ ఉంది. ఒకప్పుడు ఇలియానా తెలుగుతో పాటు, దక్షిణాదిలో చేసిన సందడి అంతా ఇంతా కాదు. పోకిరి చిత్రంతో ఓవర్ నైట్ స్టార్ గా మారిపోయిన ఇలియానా వెనుదిరిగి చూసుకోలేదు. కానీ కెరీర్ పీక్స్ లో ఉన్న టైమ్ లో ఇలియానా బాలీవుడ్ కు వెళ్ళింది. 

ఆశించిన మేరకు బాలీవుడ్ లో ఇలియానా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం ఇలియానాకు హిందీలో అరకొరగా మాత్రమే ఆఫర్స్ వస్తున్నాయి. అది కూడా ప్రాధాన్యత లేని చిత్రాల్లో మాత్రమే ఇలియానాకు దర్శకులు ఆఫర్స్ ఇస్తున్నారు. జోరు తగ్గిన తన కెరీర్ లో తిరిగి పుంజుకోవాలని ఇలియానా భావిస్తోంది. అందుకోసం సౌత్ లో ఆఫర్స్ వచ్చినా చేయాలనే ఆలోచనలో ఇలియానా ఉంది. 

తమిళ స్టార్ హీరో అజిత్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం 'వాలిమై'. ఖాకి ఫేమ్ హెచ్ వినోద్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ చిత్రంలో అజిత్ కు జోడిగా యామి గౌతమ్ పేరుని పరిశీలించారు. ప్రస్తుతం ఇలియానాతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

రజనీ 'దర్బార్' ట్రైలర్.. 'ఒరిజినల్ గానే విలన్ ని'.. కేక పెట్టించేలా పంచ్ డైలాగ్స్!

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లకు ఆస్కారం ఉందని.. యామి గౌతమ్, ఇలియానా ఇద్దరూ అజిత్ తో రొమాన్స్ చేసే అవకాశం ఉన్నట్లు తమిళ సినీ వర్గాల నుంచి సమాచారం. అజిత్ సినిమాలో నటించడం అంటే ఇలియానాకు ఇది క్రేజీ ఆఫర్ అని చెప్పొచ్చు. ఇదే కనుక జరిగితే చాలా కాలం తర్వాత ఇలియానాకు బంపర్ ఆఫర్ దొరికినట్లే. 

బాలయ్య కాన్సెప్ట్ తో చిరంజీవి చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?