సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. అలాంటిది స్టార్ డైరెక్టర్ దర్శత్వంలో, పర్ఫెక్ట్ టైమింగ్ సంక్రాంతికి సూపర్ స్టార్ సినిమా వస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. రజనీ తాజాగా నటిస్తున్న చిత్రం 'దర్బార్'. సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

సంక్రాంతి కానుకగా విడుదుల కానున్న దర్బార్ చిత్ర ట్రైలర్ ని తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. దర్బార్ ట్రైలర్ చూసిన తర్వాత సినిమా రజనీకాంత్ వన్ మ్యాన్ షోలా ఉండబోతున్నట్లు అర్థం అవుతుంది. 

ట్రైలర్ లో విశేషాల్ని గమనిస్తే.. రౌడీలని చీల్చి చెండాడుతూ రజని స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. 'వాడు పోలీస్ ఆఫీసరా సర్.. హంతకుడు' అనే డైలాగ్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంది. 'ఆదిత్య అరుణాచలం, కమిషనర్ ఆఫ్ పోలీస్, ముంబై' అంటూ రజనీ తనని తాను పరిచయం చేసుకుంటాడు. 

మురుగదాస్ సినిమాలో విలన్స్ పవర్ ఫుల్ గా ఉంటారు. ఈ చిత్రంలో కూడా మురుగదాస్ విలన్ పాత్రని హైలైట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. 'ముంబై పోలీసులకు ప్రాణాలంటే భయం అని మరోసారి రుజువు చేస్తా' అంటూ విలన్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. 

బాలయ్య కాన్సెప్ట్ తో చిరంజీవి చిత్రం.. డైరెక్టర్ ఎవరో తెలుసా ?

ఇక సూపర్ స్టార్ రజనీకాంత్ పంచ్ డైలాగ్స్ తో అదరగొట్టారు. 'సర్ వాళ్లకు చెప్పండి.. పోలిసుల దగ్గరకి రైట్ లో రావచ్చు.. లెఫ్ట్ లో రావచ్చు.. కానీ స్ట్రైట్ గా రావద్దని' అని రజని తనదైన శైలిలో వార్నింగ్ ఇస్తున్నాడు. 'ఒరిజినల్ గానే విలన్నమ్మా' అంటూ రజని చెబుతున్న డైలాగ్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి.

ట్రైలర్ లో నయనతార చీరకట్టులో అందంగా కనిపిస్తోంది. ట్రైలర్ లో కథ గురించి ఎక్కువగా తెలియకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. పోలీస్ ఆఫీసర్ గా రజనికి, ముంబై మాఫియా గ్యాంగ్ కు మధ్య జరిగే వార్ గా మాత్రం అర్థం అవుతోంది.