టాలీవుడ్ లో అనసూయ బ్యూటిఫుల్ యాంకర్. తన గ్లామర్, చలాకీతనంతో అనసూయ తిరుగులేని పాపులారిటీ సొంతం చేసుకుంది. అనసూయ యాంకర్ గానే కాదు.. నటిగా కూడా వెండితెరపై బిజీ. క్షణం, రంగస్థలం, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో అనసూయ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంది. అనసూయ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకుని బుల్లితెరపై కొత్త ప్రోగ్రామ్స్ సృష్టిస్తున్నారు. 

అనసూయపై ప్రేమ డైలాగులు.. బుద్దిచేప్పిన మహిళలు అనగానే ఆశ్చర్యపోవద్దు.. ఇందులో సీరియస్ వ్యవహారం ఏమీ లేదు. అనసూయ యాంకర్ గా వ్యవహరిస్తూ కొత్తగా ఓ ఛానల్ లో ప్రారంభం కాబోతున్న ప్రోగ్రాం గురించే ఇదంతా. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రోగ్రాంకు సంబందించి ప్రోమోని రిలీజ్ చేశారు.

ఇది కేవలం మహిళలకు సంబంధించిన కార్యక్రమం అని చెప్పేందుకు హైపర్ ఆదిని ఉపయోగించుకున్నారు. హైపర్ ఆది జబర్దస్త్ తరహాలో అనసూయపై ప్రేమ డైలాగులు కురిపిస్తూ ఎంటర్ అవుతాడు. ఆమెకు రోజా పువ్వు కూడా ఇస్తాడు. నువ్వు నాపై పంచ్ లు వేయడానికి ఇది జబర్దస్త్ కాదు అని అనసూయ అంటుంది. 

'ద్వారక' రహస్యాలపై నిఖిల్ కన్ను.. యంగ్ హీరోయిన్ తో రొమాన్స్!

అయినా కూడా హైపర్ ఆది పంచ్ లు ఆగవు. దీనితో అనసూయ కొందరు మహిళలని రంగంలోకి దించుతుంది. దీనితో ఆడవాళ్ళంతా హైపర్ ఆదిని చుట్టుముడుతారు. ఆడవాళ్ళ షోకి రాకూడదని తెలియదా అని ప్రశ్నిస్తారు. ఈ టైం లో మొగుడికి లంచ్ పెట్టాలని తెలియదా అని ఆది తనదైన శైలిలో మరో పంచ్ డైలాగ్ పేలుస్తాడు. 

మళ్ళీ పవన్ నే నమ్ముకున్న బండ్ల గణేష్ ?.. వైరల్ అవుతున్న పోస్ట్!

దీనితో ఆడవాళ్ళంతా ఆదిపై విరుచుకుపడి చితకబాదుతారు. మంచి ఫన్ ఉన్న ఈ ప్రోమో ఆకట్టుకుంటోంది. ప్రతిరోజూ పండగే అనే టైటిల్ తో త్వరలో ప్రారంభం కానున్న ఈ మహిళల ప్రోగ్రాంకు అనసూయ హోస్ట్ గా వ్యవహరించనుంది.