యంగ్ హీరో నిఖిల్ విభిన్నమైన కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. నిఖిల్ చివరగా అర్జున్ సురవరం చిత్రంతో మంచి సక్సెస్ అందుకున్నాడు. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన ఈ చిత్రం గత ఏడాది నవంబర్ 29న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ ఏడాది నిఖిల్ కొత్త ప్రాజెక్ట్స్ పై దృష్టి పెట్టాడు. 

నిఖిల్ తదుపరి చిత్రం చందూ ముండేటి దర్శత్వంలో ఉండబోతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన కార్తికేయ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతోంది. కార్తికేయ కంటే భారీ స్థాయిలో సీక్వెల్ ఉండేలా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికర విషయాలు బయటకు వచ్చాయి. 

కార్తికేయ చిత్రంలో.. ఓ గుడిని అడ్డం పెట్టుకుని ప్రజలని మోసం చేస్తున్న ఓ గ్యాంగ్ గుట్టురట్టు చేసే యువకుడిగా నిఖిల్ నటించాడు. కార్తికేయ 2 కూడా దేవాలయాలకు సంబందించిన కథే. కానీ దర్శకుడు చందూ ముండేటి ఇంకాస్త భారీ స్థాయిలో కథని సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

అల వైకుంఠపురములో జోరు.. 'భరత్ అనే నేను' రికార్డ్ బ్రేక్

ఈ చిత్రంలో కార్తికేయ దేవాలయాల ఆర్కిటెక్ట్ గా నటించబోతున్నాడు. ఇండియాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత ప్రాంతాలు, దేవాలయాలపై ఈ చిత్రం ఉండబోతోంది. హిందూ పురాణాల్లో ద్వారక గురించి గొప్పగా చెబుతారు. ఈ చిత్రంలో నిఖిల్ ద్వారకతో పాటు, ఇతర దేవాలయాల్లో స్వయంభువుగా చెప్పబడే విగ్రహాలపై నిఖిల్ పరిశోధనలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. 

ఈ చిత్రంలో నిఖిల్ కి జోడిగా లేటెస్ట్ సెన్సేషన్ నభా నటేష్ నటించబోతున్నట్లు తెలుస్తోంది.