Asianet News TeluguAsianet News Telugu

యంగ్ హీరోయిన్ తో గుత్తా జ్వాల ప్రియుడు రొమాన్స్!

తమిళ హీరో విష్ణు విశాల్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తమిళనాట మంచి విజయాలు అందుకుంటూ విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారాడు. విష్ణు విశాల్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా విష్ణు విశాల్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

hero vishnu vishal's anouther movie confirmed
Author
Hyderabad, First Published Jan 5, 2020, 12:41 PM IST

తమిళ హీరో విష్ణు విశాల్ ప్రస్తుతం ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. తమిళనాట మంచి విజయాలు అందుకుంటూ విష్ణు విశాల్ క్రేజీ హీరోగా మారాడు. విష్ణు విశాల్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా విష్ణు విశాల్ వ్యక్తిగత జీవితానికి సంబందించిన వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

విష్ణు విశాల్, హైదరాబాద్ బ్యాట్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల గత కొంతకాలంగా ఘాడమైన ప్రేమలో మునిగితేలుతున్నారు. ఈ విషయాన్ని ఖరారు చేస్తూ గుత్తా జ్వాలా కూడా తన ఇన్స్టాగ్రామ్ లో విష్ణు విశాల్ తో కలసి ఉన్న ఫోటోలని షేర్ చేస్తోంది. న్యూఇయర్ సందర్భంగా గుత్తా జ్వాలని విష్ణు విశాల్ ముద్దు పెట్టుకుంటున్న ఫోటో వైరల్ అయింది. 

తామిద్దరం రిలేషన్ షిప్ లో ఉన్న విషయం గురించి కూడా గుత్తా జ్వాల ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇచ్చింది. విష్ణు విశాల్ తదుపరి చిత్రం ఖరారైంది. సెల్లా అయ్యావు దర్శత్వంలో విష్ణు విశాల్ కొత్త చిత్రం ప్రారంభమైంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. 

కిల్లర్ లేడీస్.. హత్యలు చేసేందుకు కూడా వెనుకాడని హీరోయిన్లు!

ఈ మూవీలో హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియా భవాని శంకర్ ని సంప్రదించారు. కథ నచ్చడంతో ప్రియా భవాని వెంటనే అంగీకరించినట్లు తెలుస్తోంది. కాకపోతే ఆమె షూటింగ్ లో ఆలస్యంగా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ప్రియా భవాని వరుస చిత్రాలతో బిజీగా గడుపుతోంది. ఆ చిత్రాల షూటింగ్ పూర్తయిన తర్వాతే విష్ణు విశాల్ చిత్రానికి డేట్స్ కేటాయిస్తానని ప్రియా భవాని నిర్మాతలకు తెలిపిందట. 

చిరంజీవి, మహేష్, విజయశాంతి ఎఫెక్ట్.. పోలీసులు ఏం చేస్తున్నారంటే..

ఈ ఏడాది విష్ణు విశాల్ నుంచి ఆసక్తికరమైన చిత్రాలు రాబోతున్నాయి. ఆ చిత్రాలన్నీ విజయం సాధిస్తే గుత్తా జ్వాల ప్రియుడు మరోస్థాయికి చేరినట్లే. 

Follow Us:
Download App:
  • android
  • ios