2016లో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వరుస అవకాశాలతో దూసుకుపోతూ సినిమాలు చేస్తోంది. మలయాళం, తమిళ భాషల్లోనే సంయుక్త మీనన్ సినిమాలు చేస్తోంది. ఇటీవల సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు సెలబ్రిటీలని ఇబ్బందికి గురిచేసే సంఘటనలు జరుగుతున్నాయి. 

తాజాగా సంయుక్త మీనన్ కూడా లాంటి చేదు అనుభవమే ఎదుర్కొంది. సంయుక్త మీనన్ సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటించే కార్యక్రమం చేసింది. ఓ నెటిజన్ సంయుక్త మీనన్ ని అసభ్యకరమైన ప్రశ్న అడిగాడు. మీరు వర్జినా అంటూ ప్రశ్నించాడు. దీనితో సంయుక్త మీనన్ ఆగ్రహంతో అతడికి అదిరిపోయే సమాధానం ఇచ్చింది. 

జగన్ 'సౌత్ కొరియా' కామెంట్.. ఫసక్ అంటూ మంచు మనోజ్ సెటైర్!

మిస్టర్ అతుల్.. నీలాంటి వాళ్ళు వర్జినిటీ, సెక్స్, ఆల్కహాల్ గురించి ఎక్కువగా ఆలోచిస్తుండడం వల్లే ప్రస్తుతం అమ్మాయిలు భయాందోళనకు గురవుతున్నారు. మహిళలు ఎక్కడైనా ఇలాంటి విషయాలు మాట్లాడడం చూశావా.. లేక నీకు ఇలాంటివే ఇష్టమా.. అయితే నీకు ఏదో సమస్య ఉన్నట్లే. 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా: సరైన సమయంలో నితిన్ 20 లక్షల విరాళం

ఇలాంటి కామెంట్స్ కు మహిళలు చెంప చెళ్లుమనిపించడం ఇంకా మొదలుపెట్టలేదు. కానీ జాగ్రత్తగా ఉండు.. నీ చెంప పగలగొట్టే అమ్మాయి ఎక్కడో ఉండే ఉంటుంది అని సంయుక్త మీనన్ సదరు ఆకతాయికి ఘాటుగా వార్నింగ్ ఇచ్చింది.