ప్రస్తుతం వెండితెరపై హీరో, హీరోయిన్ల మధ్య లిప్ లాక్ సన్నివేశాలు సాధారణంగా మారిపోయాయి. కుర్రకారుని ఆకర్షించేందుకు తమ చిత్రాల్లో ఎదో విధంగా లిప్ లాక్ సన్నివేశాలు ఉండేలా దర్శక నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. రొమాంటిక్ ప్రేమ కథలైతే లిప్ లాక్ సీన్స్ కంపల్సరీ. 

మలయాళీ భామ నిఖిల విమల్ ఇప్పుడిపుడే సౌత్ లో క్రేజ్ సొంతం చేసుకుంటోంది. దక్షణాది అన్ని భాషల్లో నటించే ప్రయత్నం చేస్తోంది. ఈ 25 ఏళ్ల కుర్రభామ తాజాగా నటించిన చిత్రం 'దొంగ'. ఖైదీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత కార్తీ నుంచి వస్తున్న చిత్రం ఇది. 

ఈ చిత్రంలో కార్తీ వదిన జ్యోతిక కూడా కీలక పాత్రలో నటిస్తుండడం విశేషం.రియల్ లైఫ్ లో కార్తీకి వదిన అయిన జ్యోతిక ఈ చిత్రంలో అక్కగా నటిస్తోంది. ఇంటి నుంచి పారిపోయిన చిన్న పిల్లవాడు 15 ఏళ్ల తర్వాత ఎలా తిరిగి వచ్చాడు అనేది ఈ చిత్ర కథ. జీతూ జోసెఫ్ ఈ చిత్రానికి దర్శకుడు. దృశ్యం లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాన్ని తెరకెక్కించిన జీతూ దర్శకత్వంలో ఈ మూవీ వస్తుండడంతో ఆసక్తి నెలకొంది. 

ఈ చిత్ర విశేషాలని హీరోయిన్ నిఖిల విమల్ ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. గతంలోనే జీతూ జోసెఫ్ దర్శకత్వంలో నటించాల్సింది. కానీ కుదర్లేదు. అయినా కూడా ఆయన నాకు దొంగ చిత్రంతో మరో అవకాశం ఇచ్చాడు. అందరిలాగే నేను కూడా సూర్య, జ్యోతిక జోడికి అభిమానిని. అలాంటిది జ్యోతిక గారితో కలసి నటించడం చాలా సంతోషాన్నిచ్చే విషయం. 

వెంకీ మామ రెండురోజుల వసూళ్లు.. మామ అల్లుళ్ల ప్రభంజనం!

ఇక సాధారణంగా సినిమా  తేలికపాటి సన్నివేశాలని షూట్ చేస్తారు. కానీ ఈ చిత్రం ప్రారంభంలోనే రెండు డ్యూయెట్స్ తో పాటు హీరోతో కలసి ముద్దు సన్నివేశాలని చిత్రీకరించారు. ఓ సన్నివేశంలో లిప్ లాక్ సీన్ లో నటించాల్సి ఉంది. నాకు చాలా భయం వేసింది. కానీ కార్తీ సహకారంతో ఆ సన్నివేశాల్లో ధైర్యంగా నటించగలిగాను. 

కాస్ట్లీ ఐటెం సాంగ్ లో కాజల్ అగర్వాల్.. స్టార్ హీరోతో కలసి రెచ్చిపోతుందట?

లిప్ లాక్ సన్నివేశంలో సహజంగా నటించమని కార్తీ సలహా ఇచ్చాడు. కార్తీ చాలా కూల్ గా ఉండే వ్యక్తి. ఆయన ప్రోత్సాహంతో ఈ చిత్రంలో బాగా నటించగలిగా అని నిఖిల విమల్ తెలిపింది. 

రాంచరణ్ కు అనసూయ.. అల్లు అర్జున్ కు నిహారిక!

ఇటీవల విడుదలైన దొంగ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. డిసెంబర్ 20న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు.