రియల్ లైఫ్ మామ అల్లుళ్లు విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య కలసి నటించిన చిత్రం వెంకీ మామ. జైలవకుశ ఫేమ్ బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాబీ ఈ చిత్రాన్ని మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. వెంకటేష్, నాగ చైతన్య ఫెర్ఫామెన్స్ కు మంచి స్పందన వస్తోంది. 

ఫిలిం క్రిటిక్స్ నుంచి ఈ చిత్రానికి కొంత భిన్నమైన స్పందన వచ్చినప్పటికి వసూళ్లు జోరు మాత్రం కొనసాగుతోంది. తొలిరోజు వెంకిమామ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన షేర్ రాబట్టింది. తొలిరోజు వెంకీ మామ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 6.2 కోట్ల షేర్ రాబట్టింది. 

ప్రేక్షకుల్లో వెంకీ మామ చిత్రానికి కొంత డివైడ్ టాక్ ఉన్నపటికీ రెండవరోజు కూడా వసూళ్లు స్ట్రాంగ్ గా నమోదయ్యాయి. దీనితో వెంకీ మామ చిత్రం హిట్ ఖాయం అని అంతా అంచనా వేస్తున్నారు. శనివారం రోజు వెంకీ మామ చిత్రం 4.90 కోట్ల షేర్ రాబట్టింది. ఇది మామూలు జోరు కాదు. 

వెంకీ మామ చిత్రంపై ప్రేక్షకులను ఎంత ఆసక్తిగా ఉన్నారో చెప్పేందుకు ఇదే నిదర్శనం. నైజాంలో వెంకిమామ చిత్రం రెండు రోజుల్లో 4.3 కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా వెంకీ మామ రెండు రోజుల షేర్ 11 కోట్లు దాటడం విశేషం. సీడెడ్ లో 1.7 కోట్లు, ఉత్తరాంధ్రలో 1.5 కోట్ల షేర్ ని ఈ చిత్రం రాబట్టింది. ఈస్ట్ గోదావరిలో 96 లక్షలు, కృష్ణాలో 70 లక్షలు, నెల్లూరులో 40 లక్షల షేర్ ని వెంకీ మామ చిత్రం సాధించింది. 

సురేష్ బాబు ఈ చిత్రాన్ని నిర్మించగా.. పాయల్ రాజ్ పుత్, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు.