శ్రీను వైట్ల చిత్రాలకు టాలీవుడ్ లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టే కామెడీతో శ్రీను వైట్ల చిత్రాలు ప్రేక్షకులని అలరించాయి. కాకపోతే ఇదంతా ఆగడు చిత్రం ముందు వరకు. ఆగడు మూవీ డిజాస్టర్ తో శ్రీనువైట్ల పరాజయాల పరంపర ప్రారంభమైంది. శ్రీనువైట్ల చివరగా తెరకెక్కించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. రవితేజ నటించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలయింది. 

అమర్ అక్బర్ ఆంటోని చిత్రం తర్వాత శ్రీనువైట్ల మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ఇటీవల శ్రీనువైట్ల ఓ ఇంటర్వ్యూలో మహేష్ బాబు దూకుడు చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనకు ఎందుకు వరుసగా పరాజయాలు ఎదురవుతున్నాయి.. మిస్టేక్ ఎక్కడ జరుగుతోంది అనే విషయాన్ని వివరించాడు. దీని కోసం దూకుడు చిత్రాన్ని ఉదాహరణగా చెప్పారు. 

దూకుడు చిత్రం కథని మహేష్ ఓకే చేశాడు. ప్రీప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది. మరికొన్ని రోజుల్లో సినిమా సెట్స్ పైకి వెళ్ళాలి. స్క్రిప్ట్ లాక్ చేశాం. ఒకసారి స్క్రిప్ట్ లాక్ చేస్తే ఇక ఆ కథలో నేను చిన్న మార్పులు కూడా చేయను. కానీ దూకుడు  కథపై నాకు డౌట్ ఉండేది. మహేష్ తో పాటు, నిర్మాతలు, ఇతర యూనిట్ కథ బావుందని అంటున్నారు. కానీ నాకు ఏదో మూల అనుమానంగానే ఉంది. 

ఆ సమయంలో కథలో మార్పులు చేశా. ఫలితంగా దూకుడు చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. దూకుడు కథలో మార్పులు చేయకుంటే అంత పెద్ద హిట్ అయ్యేది కాదేమో. ఇటీవల నేను అలాంటి మిస్టేక్స్ చేశా. కథని లాక్ చేసిన తర్వాత మళ్ళీ సమీక్షించుకోలేదు. చిన్న చిన్న పొరపాట్లు సరిదిద్దుకోకపోవడం వల్ల నాకు పరాజయాలు ఎదురయ్యాయి. 

హీరోయిన్ సెక్సీ డాన్స్, వీడియో వైరల్.. నెటిజన్ల ట్రోలింగ్!

ఇకపై అలంటి తప్పులు చేయకూడదని అనుకుంటున్నా. అందుకే నా వద్ద ఉన్న నాలుగైదు కథలు పక్కన పెట్టి ఓ విభిన్నమైన జోనర్ లో కథని ఎంచుకున్నా. అందులో ఎక్కువ భాగం ఎంటర్టైన్మెంట్ ఉండేలా చూసుకుంటున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. అందుకే అమర్ అక్బర్ ఆంటోని తర్వాత గ్యాప్ ఏర్పడిందని శ్రీనువైట్ల తెలిపారు.. సరైన సమయంలో తన తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తానని అన్నారు.