కరోనా కరాళ నృత్యానికి ప్రపంచమంతా విలవిల్లాడిపోతోంది. అన్ని దేశాలు, ప్రజలు కుల మత వర్ణ బేధాలు లేకుండా చివురుటాకుల్లా వణికిపోతున్నారు. ప్రభుత్వాలన్నీ ఇంకా మందు కూడా లేని ఈ మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ప్రజల కదలికలపై ఆంక్షలువై విధిస్తు తమ పరిధిలోని చర్యలన్నింటిని చేయగలిగినంత మేర చేస్తుంది. 

ఇందులో భాగంగానే ప్రధాని నరేంద్ర మోడీ నిన్న జనతా కర్ఫ్యూ కి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే! జనతా కర్ఫ్యూ తోపాటుగా సాయంత్రం 5 గంటలకు ప్రజలంతా వైద్య సేవలందిస్తున్న వారందరికీ, ప్రజల ఆరోగ్యం కోసం శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడుతున్న వారికి థాంక్స్ చెప్పడానికి అందరిని బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలుపమని చెప్పారు. 

Photos: కరోనా భయం, షట్ డౌన్: మార్కెట్ల వద్ద రద్దీ

ఇలా చప్పట్లు కొట్టమన్నది సంఘీభావం తెలపడానికి తప్ప బయటకు వచ్చి తిరగడానికి కాదు. నిన్న సాయంత్రం ఫిలిం నగర్ లోని ఒక టీ షాప్ తెరిచారు. అక్కడ సిగరెట్లు తాగుతూ కొందరు యువకులు సాయంత్రం 5 గంటలకు చప్పట్లు కొట్టారు. 

సోషల్ డిస్టెంసింగ్ పాటించమంటే... ఇలా ఒకే చోట చేరి ఈ మీటింగులేమిటని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక హీరో విశ్వక్సేన్ కూడా ఇలానే ఫైర్ అయ్యాడు. మీ తలలో రెండు నరాలు కట్ అయ్యాయా అంటూ విరుచుకుపడ్డాడు. 

సోషల్ డిస్టెంసింగ్ అంటే... దూరం పాటించడమని, ఇలా ఒకా దగ్గర చేరి మీటింగులు పెట్టడం కాదని ఫైర్ అయ్యాడు. అక్కడ చేరి రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచిస్తోస్తుంరా లేక కరోనా కి మందు కనిపెడివుతున్నారా అంటూ ఎద్దేవా చేసాడు. 

చివర్లో వీడియో ముగించేముందు దిమాగ్ గిట్ల ఖరాబయిందా, మీరు మారారు అంటూ ఫైర్ అయ్యాడు విశ్వక్సేన్. మొత్తానికి సోషల్ డిస్టెంసింగ్ అవసరాన్ని హీరో నొక్కి చెప్పడం నిజంగా అభినందించదగ్గ విషయం. 

Also Read: తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే...

లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరిహద్దులను మూసివేసింది. తొలుత జనతా కర్ప్యూ దృష్ట్యా ఈ నెల 22వ తేదీ వరకు సరిహద్దులను మూసివేశారు అయితే కరోనాను వ్యాప్తి చెందకుండా ఉంచేందుకు వీలుగా ఈ నెల 31వ తేదీ వరకు లాక్ డౌన్ ను తెలంగాణ సర్కార్ ప్రకటించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో వాహనాలు నిలిచిపోయాయి.

జనతా కర్ఫ్యూను పురస్కరించుకొని ఈ నెల 21వ తేదీ రాత్రి నుండే తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో వాహనాలను మూసివేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహారాష్ట్ర సరిహద్దులను ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఏపీ రాష్ట్ర సరిహద్దులను మూసివేశారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కర్ణాటక రాష్ట్ర సరిహద్దును మూసివేసింది ప్రభుత్వం.

ఉమ్మడి మెదక్ జిల్లాలో కూడ కర్ణాటక రాష్ట్ర సరిహద్దును కూడ మూసివేశారు పోలీసులు. ఇక నిజామాబాద్ జిల్లా సరిహద్దులో కూడ మహారాష్ట్ర సరిహద్దులను కూడ మూసివేశారు.

తెలంగాణ రాష్ట్రంలోకి ఇతర రాష్ట్రాల నుండి నిత్యావసర సరుకులను రవాణా చేసే వాహనాలను మాత్రమే అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. కూరగాయలు, పాలు, మందులు ఇతరత్రా అత్యవసర సరుకులు తరలించే వాహనాలకు మాత్రమే తెలంగాణలోకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.

కోదాడకు సమీపంలోని ఏపీ రాష్ట్ర సరిహద్దు వద్ద తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చేందుకు రోడ్డు వెంట భారీగా వాహనాలను నిలిచిపోయాయి.