Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ లాక్ డౌన్... ఈ సేవలు మాత్రం అందుబాటులోనే..

ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టేక్‌ అవే, హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది. దీంతో బ్యాచిలర్స్‌, హాస్టల్‌ వసతి అందుబాటులో లేని వాళ్లకు కాస్త ఊరట లభించింది.
 

What are essential services in covid 19 lock down in telangana
Author
Hyderabad, First Published Mar 23, 2020, 12:02 PM IST

కరోనా మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే ఈ నెల 31వరకు రాష్ట్రవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించింది. అత్యవసర పరిస్థితుల్లో విశేష అధికారాల కోసం అమలు చేసే అంటురోగాల నియంత్రణ చట్టం-1897ను రాష్ట్రంలో ప్రయోగించినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు.

అయితే.. ఈ లాక్ డౌన్ లోనూ కొన్ని సేవలు అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా ఆహారం కోసం రెస్టారెంట్లు, హోటళ్లపై ఆధారపడే వారికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు టేక్‌ అవే, హోం డెలివరీకి హోటళ్లకు అనుమతినిచ్చింది. దీంతో బ్యాచిలర్స్‌, హాస్టల్‌ వసతి అందుబాటులో లేని వాళ్లకు కాస్త ఊరట లభించింది.

లాక్ డౌన్ లో అందుబాటులో ఉండే సేవలు ఇవే..
బ్యాంకులు, ఏటీఏంలకు సంబందించిన కార్యకలాపాలు
ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా
టెలికాం, పోస్టల్, ఇంటర్నెట్ సర్వీసులు
అత్యవసర వస్తువుల సరఫరా
ఫుడ్, ఫార్మాసుటికల్, వైద్య పరికరాలకు సంబంధించిన ఈ-కామర్స్ సేవలు
ఆహార ఉత్పత్తులు, కూరగాయలు, పాలు, పండ్లు, బ్రెడ్‌, కిరాణా సామాన్లు, కోడిగుడ్లు, మాంసం, చేపలు తదితరాల రవాణా
రెస్టారెంట్ల టేక్‌ అవే, హోం డెలివరీ సేవలు
ఆస్పత్రులు, డయాగ్నస్టిక్స్‌ సెంటర్లు, ఆప్టికల్‌ స్టోర్లు, ఫార్మసుటికల్స్‌ తయారీ- రవాణా
పెట్రోలు పంపులు, ఎల్పీజీ గ్యాస్‌, ఆయిల్‌ ఏజెన్సీలు అందుకు సంబంధించిన గోడౌన్లు, రవాణా
భద్రతా సిబ్బంది(‍ప్రైవేటు సంస్థలు సహా)
కోవిడ్‌-19ను కట్టడి చేసేందుకు అత్యవసర సేవలు అందించే అన్ని ప్రైవేటు సంస్థలు
ఎయిర్‌పోర్టులు, సంబంధిత కార్యకలాపాలు 

ఈ లాక్ డౌన్ లోనూ పనిచేసే ప్రభుత్వ కార్యాలయాలు ఇవే..
జిల్లా కలెక్టరేట్‌, డివిజన్‌, మండల కార్యాలయాలు
పోలీసు వ్యవస్థ
వైద్య సిబ్బంది
స్థానిక సంస్థలు, పంచాయతీలు
అగ్నిమాపక సిబ్బంది
ఎక్సైజ్‌, కమర్షియల్‌ ట్యాక్సు, రవాణా, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల సిబ్బంది
విద్యుత్‌, నీటి సరఫరా కార్యాలయాలు
వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, మత్స సంవర్ధక, వ్యవసాయ మార్కెటింగ్‌ వ్యవస్థ
పౌర సరఫరాలు
కాలుష్య నివారణ మండి, లీగల్‌ మెట్రాలజీ, డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌
కేంద్ర ప్రభుత్వంతో అనుసంధానమయ్యే అన్ని ప్రభుత్వ సంస్థలు

Follow Us:
Download App:
  • android
  • ios