నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. 

ప్రీ రిలీజ్ వేడుకకు జీవిత, రాజశేఖర్ దంపతులు అతిథులుగా హాజరు కావడం విశేషం. ప్రీరిలీజ్ వేడుకలో రాజశేఖర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో తనని ఆదరించిన ఏకైక హీరో బాలకృష్ణ. తాను, జీవిత బాలకృష్ణ కోసమే ఈ వేడుకకు వచ్చాం అని రాజశేఖర్ తెలిపారు. 

రూలర్ అనేది బాలకృష్ణకు యాప్ట్ టైటిల్. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచే రూలర్. బాలయ్య తండ్రి ఎన్టీఆర్ గారు ఒక రూలర్. రూలింగ్ అంటే ఏంటో తన తండ్రి నుంచి బాలయ్య నేర్చుకున్నారు. ఇక ఆయన వియ్యంకుడు చంద్రబాబు పెద్ద రూలర్ అని రాజశేఖర్ సరదాగా కామెంట్ చేశారు. 

బాలయ్య సినిమా సంక్రాంతికి విడుదలవుతుందంటే తామంతా జాగ్రత్త పడేవాళ్ళం. సంక్రాంతికి ఆయనే రూలర్. ఈసారి సంక్రాంతి కంటే ముందే వచ్చేస్తున్నాడు. రూలర్ మూవీ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు రాజశేఖర్ తెలిపారు. 

ఇక రాజశేఖర్ సతీమణి జీవిత మాట్లాడుతూ.. మంచి మనసున్న వ్యక్తి బాలయ్య. మనసులో ఒకటి ఉంచుకుని బయటకు మరొకటి అయన మాట్లాడరు. ఎన్నో మాటలు చెప్పే చాలామందిని చూశాం. వాళ్ళు చెప్పేది నిజామా అబద్దమా అని మనకే డౌట్ వస్తుంది. కానీ బాలయ్య అలా కాదు. చిన్నపిల్లల మనస్తత్వం. అలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారు అని జీవిత అన్నారు. రూలర్ మూవీ బాక్సాఫీస్ ని రూల్ చేయడం ఖాయం అని ఆమె తెలిపారు. 

ఫ్యాన్స్ కు ఏమైనా జరిగితే ముందుండేది బాలయ్యే.. బోయపాటి శ్రీను!

రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..