Asianet News TeluguAsianet News Telugu

ఫ్యాన్స్ కు ఏమైనా జరిగితే ముందుండేది బాలయ్యే.. బోయపాటి శ్రీను!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Boyapati Srinu Speech at Balakrishna's Ruler Prerelease Event
Author
Hyderabad, First Published Dec 14, 2019, 9:07 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 105వ చిత్రం రూలర్. జై సింహా లాంటి కమర్షియల్ హిట్ అందించిన కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో బాలకృష్ణ మరోసారి నటిస్తున్న చిత్రం ఇది. భారీ నిర్మాణ విలువలు, అదిరిపోయే స్టార్ కాస్టింగ్ తో రూలర్ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ శనివారం రోజు వైజాగ్ లో ప్రీరిలీజ్ వేడుక నిర్వహిస్తోంది.   

ప్రీరిలీజ్ వేడుకలో బాలయ్యకు లెజెండ్, సింహా లాంటి రెండు సూపర్ హిట్ చిత్రాలు అందించిన స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ప్రసంగించారు. బాలయ్యని పొగడ్తల వర్షంలో ముంచెత్తారు. వైజాగ్ నందమూరి అభిమానుల గురించి బోయపాటి ముందుగా మాట్లాడారు. వైజాగ్ వాసులు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటారు. ఎంతటి తుఫానులనైనా ఎదుర్కొనే శక్తి కేవలం వైజాగ్ ప్రజలకే ఉంటుంది. 

నేను ఏ సినిమా తీసినా వైజాగ్ లో షూటింగ్ చేయాలని తప్పకుండా ప్రయత్నిస్తా అని బోయపాటి తెలిపారు. బాలకృష్ణకు రూలర్ అనే టైటిల్ బాగా సరిపోతుంది. ఎందుకంటే బాలయ్య రూలర్ ఆఫ్ ది ఆర్ట్స్, రూలర్ ఆఫ్ ది హార్ట్స్. బాలయ్య ఓ పాత్ర కోసం కమిటయ్యారు అంటే ఆ పాత్ర కోసం ఆయనే శిరస్సు వంచుతారు. ఒకసారి పాత్రలో లీనమయ్యాక ఆ పపాత్రే బాలయ్య ముందు మోకరిల్లుతుంది అని బోయపాటి అన్నారు. 

ఇక అభిమానులకు ఏమైనా జరిగితే ముందుండి ఆదుకునే వ్యక్తి బాలయ్య. తన ముందు కన్నీరు పెట్టుకుంటే ఆ కన్నీరు తుడిచి మరీ ఆడుకుంటారు. అందుకే బాలయ్య  బాలయ్య రూలర్ ఆఫ్ ది ఆర్ట్స్, రూలర్ ఆఫ్ ది హార్ట్స్ అని బోయపాటి అన్నారు. 

ఇక కేఎస్ రవికుమార్ ఎన్నో గొప్ప చిత్రాలు చేశారు. ఆయన మా అందరికి ఆదర్శం. జైసింహా తర్వాత రాబోతున్న ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందని బోయపాటి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక ఈ చిత్ర టైటిల్ రూలర్ ని ముందుగా తానే రిజిస్టర్ చేయించుకున్నానని.. ఆ టైటిల్ తో బాలయ్య సినిమా చేయడం సంతోషంగా ఉందని బోయపాటి అన్నారు. 

రూలర్ ప్రీరిలీజ్:రజనీని దేవుడిని చేసింది ఆయనే.. రైతుల కోసం బాలయ్య అడిగిమరీ..

రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

Follow Us:
Download App:
  • android
  • ios