యాంగ్రీ హీరో రాజశేఖర్ నేడు(బుధవారం నవంబర్ 13)న రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఆయన ప్రయాణిస్తున్న కారు శంషాబాద్ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్డు వద్ద బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో క్షేమంగా బయటపడ్డారు. రాజశేఖర్ ప్రమాదానికి గురయ్యాడనే వార్త బయటకు వచ్చాక అభిమానుల్లో, సినీ ప్రముఖుల్లో ఆందోళన నెలకొంది. 

దీనితో ఆయన సతీమణి జీవిత క్లారిటీ ఇస్తూ.. రాజశేఖర్ క్షేమంగా ఉన్నారని తెలిపారు. అభిమానుల ప్రేమాభిమానాలవల్లే ఆయనకు కార్ యాక్సిడెంట్ నుంచి క్షేమంగా బయటపడ్డట్లు జీవిత తెలిపింది. ఇదిలా ఉండగా తన కారు ప్రమాదం గురించి స్వయంగా వెల్లడించేందుకు రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చారు. 

Rajasekhar car accident: శివాని, శివాత్మికల ఎమోషనల్ కామెంట్స్

రాజకేఖర్ మాట్లాడుతూ.. స్వల్ప గాయాలు తప్ప తనకు ఎలాంటి హాని హరగలేదని అన్నారు. కారు బోల్తా కొట్టడం వల్ల కాస్త ఒంటి నొప్పులు ఉన్నట్లు తెలిపారు. తాను ప్రమాదానికి గురయ్యానని తెలిసిన వెంటనే చాలా మంది స్నేహితులు, సినీ ప్రముఖులు ఫోన్లు, మెసేజ్ లు చేశారని రాజశేఖర్ అన్నారు. 

అభిమానులంతా నా యోగ క్షేమాల గురించి ఆరా తీశారు. తనపై ఇలా ప్రేమాభిమానాలు చూపించిన ప్రతి ఒక్కరికి రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ సందర్భంగా రాజశేఖర్ చిత్ర పరిశ్రమపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

ప్రమాదానికి కారణం అదే .. రాజశేఖర్ యాక్సిడెంట్ పై పోలీసులు!

మా అసోసియేషన్ లో ఇటీవల కొన్ని వివాదాలు జరిగాయి. కానీ చిత్ర పరిశ్రమ మొత్తం ఒక ఫ్యామిలీ.  ఎవరైనా మరణించినప్పుడు వారి కుటుంబ సభ్యులని కలసి పరామర్శించాలి. ప్రమాదాలకు గురైతే వారిని కలసి పలకరించాలి. మనం క్రమంగా గౌరవాన్ని తగ్గించుకుంటూ వెళుతున్నాం. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఒక్క పలకరింపే సంతోషాన్ని ఇస్తుంది. డిజిటల్ యుగంలో ఉన్నాం కాబట్టి కనీసం ఒక్క ట్వీట్ అయినా చేయాలి అని రాజశేఖర్ అన్నారు.