ప్రముఖ హీరో రాజశేఖర్ మరోసారి రోడ్డు ప్రమాదం నుండి సురక్షితంగా బయటపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుండి ఆయన క్షేమంగా బయటపడ్డారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ రోడ్ ఔటర్ రింగ్ రోడ్డులో మంగళవారం అర్ధరాత్రి ఈ దుర్ఘటన జరిగింది.

రామెజీఫిల్మ్‌ సిటీ నుంచి తన కారులో ఇంటికి వస్తుండగా కారు టైరు పగిలి డివైడర్‌ను ఢీకొని, కారు పల్టీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులోనిఎయిర్‌బ్యాగ్స్‌ సకాలంలో తెరుచుకోవడంతో ఆయన ప్రమాదం నుంచి బయటపడ్డారు.

ఈ విషయంపై స్పందించిన రాజశేఖర్..  తనకు ఎటువంటి గాయాలు కాలేదని, క్షేమంగా ఉన్నానని స్పష్టం చేశారు. ప్రమాదం జరిగిన తరువాత మొదట పోలీసులకు, తర్వాత తన కుటుంబ సభ్యులకు సమాచారం అందించానని.. అక్కడ నుండి వారి కారులో ఇంటికి బయలు దేరానని చెప్పారు.

హీరో రాజశేఖర్ కారు బోల్తా.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం

అయితే పోలీసులు మాత్రం నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం వలనే ప్రమాదం జరిగిందని చెబుతున్నారు. TS 07 FZ 1234 కారులో రాజశేఖర్ ఒక్కరే ఉన్నారని.. ఆయనకి చిన్న గాయాలయ్యాయని పోలీసులు వెల్లడించారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. రాజశేఖర్ ఇటీవల ఒక సినిమా నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.  స్క్రిప్ట్ విషయంలో దర్శకుడికి హీరోకు అభిప్రాయం బేధాలు రావడంతో సినిమా సెట్స్ పైకి వచ్చిన కొన్ని రోజులకే ఆగిపోయింది.దీంతో ఆ చిత్ర నిర్మాత మరొక హీరోను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. చివరగా రాజశేఖర్ కల్కి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని రాజశేఖర్ కథల వేటలో పడ్డారు. తన దగ్గరకు వచ్చిన ప్రతి దర్శకుడితో స్టోరీ డిస్కర్షన్స్ చేస్తున్నారట. కథ ఏ మాత్రం నచ్చిన సినిమాని సెట్స్ పైకి తేవాలని మంచి స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.

ఇటీవల వీరభద్రమ్ చెప్పిన ఒక థ్రిల్లర్ కథ ఈ సినీయార్ హీరోకి బాగా నచ్చేసిందట. దీంతో వెంటనే ఏడు చేపల కథ నిర్మాత శేఖర్ రెడ్డి ప్రొడక్షన్ హౌజ్ లో త కొత్త సినిమాను నిర్మించేందుకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.