Asianet News TeluguAsianet News Telugu

Rajasekhar car accident: శివాని, శివాత్మికల ఎమోషనల్ కామెంట్స్

యాక్సిడెంట్ పై ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. చిన్నగాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరు కూడా ఘటనపై స్పందించారు. సోషల్ మీడియాల్ వస్తున్న రూమర్స్ డోస్ పెరగకముందే ఫ్యామిలీ మొత్తం ఇచ్చిన స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చేసింది.

shivani shivatmika emotinal comments rajasekhar car accidents
Author
Hyderabad, First Published Nov 13, 2019, 2:05 PM IST

హీరో రాజశేఖర్ యాక్సిడెంట్ పై ఆయన సతీమణి జీవితా రాజశేఖర్ మీడియా ముందుకు వచ్చి క్లారిటీ ఇచ్చారు. చిన్నగాయలతో ప్రమాదం నుంచి బయటపడ్డారని ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. అలాగే రాజశేఖర్ కూతుర్లు శివాని, శివాత్మిక ఇద్దరు కూడా ఘటనపై స్పందించారు.

సోషల్ మీడియాల్ వస్తున్న రూమర్స్ డోస్ పెరగకముందే ఫ్యామిలీ మొత్తం ఇచ్చిన స్టేట్మెంట్ తో క్లారిటీ వచ్చేసింది.  "అందరికీ హాయ్ .. నిన్న రాత్రి డాడీ ఒక పెద్ద ప్రమాదంను ఎదుర్కొన్నారు. అదృష్టవశాత్తూ, దేవుని దయ వల్ల ఆయనకి ఏమీ జరగలేదు,  నాన్నగారు బాగానే ఉన్నారు. ఆయన యోగ క్షేమాల కోసం చేసిన ప్రార్థనలు ఫలించాయి.  అందరూ ఆయనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు, ఆయన క్షేమంగా ఉన్నారు" అని శివాని - శివాత్మిక సోషల్ మీడియాలో పేర్కొన్నారు.

Read also: హీరో రాజశేఖర్ కారు బోల్తా.. ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం

రాజశేఖర్ యాక్సిడెంట్ కి సంబందించిన వార్త ఈ ఉదయం అందరిని షాక్ కి గురి చేసిన విషయం తెలిసిందే. ప్రమాదం జరగడంతో రాజశేఖర్ యోగ క్షేమాల గురించి చాలా మంది తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఈ గ్యాప్ లో సోషల్ మీడియాలో అలాగే పలు వెబ్ సైట్ లలో అనేక రకాల రూమర్స్ వైరల్ అయ్యాయి. రాజశేఖర్ కారు ప్రమాదం జరగడానికి అసలు కారణం ఏమిటనే సందేహాలకు ఆయన సతీమణి సీనియర్ నటిమణి జీవితా రాజశేఖర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

జీవిత మాట్లాడుతూ.. యాక్సిడెంట్ కాగానే చాలా మంది ఫోన్ చేశారు. ఘటనకు సంబందించిన పూర్తి విషయాన్నీ చెప్పడానికి మీడియా ముందుకు వచ్చాను. ఇప్పటికే రకరకాల వార్తలు వచ్చాయి. జరిగింది ఏమిటంటే.. రాత్రి 1.30 గంటలకు రామోజీ ఫిల్మ్ సిటీ నుంచి ఇంటికి వస్తుండగా కారు టైర్ పగిలి కంట్రోల్ తప్పింది. డివైడర్ ని తాకడంతో పల్టీలు కొట్టింది. అప్పుడు మరో కారులో ఎదురుగా వస్తున్న కొంతమంది రాజశేఖర్ ని గుర్తుపట్టి వారి కారులో తీసుకువస్తుండగా మధ్యలో మాకు సమాచారం అందించడంతో మేము పికప్ చేసుకున్నాం.

వెంటనే పోలీసులకు కూడా సమాచారం వెళ్లింది.  నేను కూడా పోలీసులకు జరిగిన విషయాన్నీ చెప్పాను. రాజశేఖర్ వస్తువులను వెరిఫై చేశాక ఆయన క్షేమంగా ఉన్నారా అని అడిగారు. ఆయనతో కూడా మాట్లాడించడం జరిగింది. అనంతరం ఇంటికి వచ్చి డాక్టర్ కూడా చెకప్ చేశారు. చిన్న గాయం తప్ప ఎలాంటి ప్రమాదం జరగలేదని చెప్పారు. గాయానికి చిక్కిత్స చేసి డాక్టర్ వెళ్లిపోయారు.

ఎప్పటికప్పుడు పోలీసులతో టచ్ లో ఉంటూ వివరాలు అందించాను. స్టేషన్ కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వాలని పోలీసు అధికారులు చెప్పారు. రాజశేఖర్ గారు కోలుకున్న తరువాత తప్పకుండా వస్తామని చెప్పాము. ఇదే జరిగింది. నిజానికి ఇది పెద్ద ప్రమాదమే.. కానీ రాజశేఖర్ క్షేమంగా బయటపడటానికి అభిమానుల ప్రేమే కారణం. మీ అందరి ప్రేమ అభిమానానికి ధన్యవాదాలు అని జీవిత వివరణ ఇచ్చారు.

Follow Us:
Download App:
  • android
  • ios