చిత్ర పరిశ్రమలో నటీనటులు మధ్య ప్రేమ వ్యవహారాలు జరుగుతుండడం సహజమే. కానీ హీరోలు, హీరోయిన్లు తమ రిలేషన్ షిప్ వ్యవహారాల్ని బయట పెట్టేందుకు ఇష్టపడరు. సాధ్యమైనంత మేరకు మీడియాకు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. 

జర్నీ, రాజా రాణి లాంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా హీరో జై చేరువయ్యాడు. ముఖ్యంగా జర్నీ చిత్రంలో జై, అంజలి మధ్య కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. జర్నీ చిత్రంతో అంజలి, జై మధ్య స్నేహం చిగురించింది. కొంతకాలం పాటు వీరి మధ్య ప్రేమ వ్యవహారాలు కూడా సాగాయి. ఇటీవల ఈ జంట మధ్య బ్రేకప్ జరిగినట్లు వార్తలు వచ్చాయి. 

తాజాగా హీరో జై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అంజలితో తన రిలేషన్ షిప్ పై స్పందించాడు. తమ మధ్య ఉన్నది స్నేహం మాత్రమే అని జై పేర్కొన్నాడు. త్వరలో తన వివాహం వేరే అమ్మాయితో జరగనున్నట్లు జై ప్రకటించాడు. 

ఆ సినిమా కొన్నాం.. మా ప్రాణం పోయింది.. డైరెక్టర్ మారుతి

చాలా కాలంగా జై ఇస్లాం మతంలోకి మారినట్లు వార్తలు వచ్చాయి. అది వాస్తవమే అని.. తాను ఇస్లాం మతం స్వీకరించానని ఒప్పుకున్నాడు. గత ఏడేళ్లుగా తాను నమాజ్ చేస్తున్న విషయాన్ని కూడా జై బయట పెట్టాడు. నేను ఇస్లాం స్వీకరించినప్పుడు మా కుటుంబ సభ్యులు అడ్డు చెప్పలేదు. ఏ దేవుడిని నమ్మకపోవడం కంటే.. ఏదో ఒక దేవుడిని నమ్మడం మంచిదే కదా అని భావించారు. 

మాజీ ప్రియుడితో ఘాటు రొమాన్స్.. రెచ్చిపోయారుగా!

త్వరలో తన పేరుని 'అజీస్ జై'గా మార్చుకోబోతున్నట్లు జై తెలిపాడు. జై లేటెస్ట్ మూవీ కేవ్ మారి త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది.