మెగా హీరో సాయిధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం థియేటర్స్ లో సందడి చేస్తోంది. రాశి ఖన్నా, తేజు జంటగా నటించిన ఈ చిత్రంలో మారుతి మార్క్ హాస్యం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. తన తాత చివరి రోజుల్లో మనవడు ఏం చేశాడనే సీరియస్ పాయింట్ ని కథగా ఎంచుకున్న మారుతి.. ఎక్కడా వినోదం మిస్ కాకుండా చూసుకున్నాడు. 

దీనితో ప్రతిరోజూ పండగే చిత్రానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో రావు రమేష్ పోషించిన పాత్ర కూడా మరో హైలైట్. ప్రేక్షకుల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండడం.. కలెక్షన్స్ కూడా అదరగొడుతుండడంతో చిత్ర యూనిట్ నేడు సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సక్సెస్ మీట్ కు పరుచూరి గోపాల కృష్ణ, సుకుమార్ అతిథులుగా హాజరయ్యారు. 

సక్సెస్ మీట్ లో మారుతి మాట్లాడుతూ డిస్ట్రిబ్యూటర్ గా ప్రారంభమైన తన కెరీర్ ని గుర్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను ఈ రోజు ఇలా ఇండస్ట్రీలో ఉన్నానంటే అందుకు పరోక్షంగా సుకుమార్ గారే కారణం అని మారుతి తెలిపాడు. 

తాను, బన్నీ వాసు డిస్ట్రిబ్యూటర్స్ గా ఉన్న సమయంలో ప్రాణం అనే చిత్రాన్ని కొన్నాం. ఆ సినిమా వల్ల మా ప్రాణాలు పోయాయి అంటూ మారుతి సరదాగా కామెంట్స్ చేశాడు. ఆ చిత్రంతో నష్టపోయిన తాము ఇండస్ట్రీకి దూరమవ్వాలని అనుకున్నాం. 

ఆ సమయంలోనే సుకుమార్ గారు అల్లు అర్జున్ తో ఆర్య చిత్రాన్ని తెరకెక్కించారు. అప్పుడే అల్లు అరవింద్ గారిని కలవడం జరిగింది. సుకుమార్ కొత్త దర్శకుడు అయినప్పటికీ సినిమా అద్భుతంగా తీశారని బన్నీ వాసు చెప్పాడు. ఆ సమయంలో నా దగ్గర డబ్బు కూడా లేదు. వేరే వ్యాపారం కోసం అని అబద్దం చెప్పి నా భార్య దగ్గర రూ 5 లక్షలు తీసుకుని ఆర్య చిత్రాన్ని పాలకొల్లు ఏరియాకు కొన్నాం. 

మాజీ ప్రియుడితో ఘాటు రొమాన్స్.. రెచ్చిపోయారుగా!

ఆర్య సినిమా మంచి సక్సెస్ రావడంతో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాం.. అలా తాము టాలీవుడ్ లో సక్సెస్ కావడానికి సుకుమార్ గారు కారణం అయ్యారు అని మారుతి తెలిపాడు.

'ప్రతిరోజూ పండగే' సెకండ్ డే కలెక్షన్స్.. పట్టునిలుపుకున్న తేజు సినిమా! 

ఇక ప్రతిరోజూ పండగే చిత్రం గురించి మాట్లాడుతూ.. థియేటర్స్ ప్రేక్షకులు కామెడీకి నవ్వుతుండడంతో నాలో ఇంకా కసి పెరిగింది. వారిని మరింతగా నవ్వించాలని అనుకుంటున్నా. ఈ చిత్రంలో ఎమోషనల్ సీన్స్ కూడా రాశాం. కానీ ఎమోషన్ ని డామినేట్ చేసేంతగా కామెడీ హైలైట్ అయింది అని మారుతి తెలిపాడు.