బిగ్ బాస్ సీజన్ 3 మరో వారం రోజుల్లో ముగుస్తుంది. ప్రస్తుతం హౌస్ లో 6గురు సభ్యులు ఉన్నారు. ఆదివారం రోజు ఒకరు ఏలిమినేట్ అవుతారు. ఇలాంటి తరుణంలో బిగ్ బాస్ షోపై, శ్రీముఖిపై హేమ సంచలన వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షోలో తనకు అవమానం జరిగిందని హేమ పేర్కొంది. 

బిగ్ బాస్ 3: రాహుల్ కి క్లాస్ పీకిన నాగ్.. ఫైనల్స్ లో శ్రీముఖి!

తాను ఎలిమినేట్ అయిన తర్వాత కనీసం ఏవీ(ఆడియో విజువల్) కూడా పూర్తిగా వేయకుండా పంపించేశారని హేమ అభిప్రాయపడింది. ఆ తర్వాత పొట్టి డైరెక్టర్ పై గట్టిగా అరిచేశా. సారి మేడం నాకు టైం లేదు అని చెప్పాడు. 

శ్రీముఖి పథకం వల్లే బిగ్ బాస్ లో అందరూ బలవుతున్నారని హేమ ఆరోపించింది. బిగ్ బాస్ ప్రారంభం కాక ముందు శ్రీముఖి బర్త్ డే సెలెబ్రేషన్స్ జరిగాయి. ఆ సెలెబ్రేషన్స్ కు రాహుల్ కూడా హాజరయ్యాడు. కానీ నేను మాత్రం హాజరు కాలేదు. నేను వారందరికీ ప్రధాని పోటీ అని నాపై ఆ బర్త్ డే సెలెబ్రేషన్స్ లోనే కుట్ర పన్నారు. ఎవరెప్పుడు ఎలిమినేట్ కావాలనే విషయాన్ని కూడా అక్కడే డిసైడ్ చేసారని హేమ ఆరోపించింది. 

బిగ్ బాస్3: 'రాములో రాములా' అంటున్న నాగ్.. విజయ్ దేవరకొండ సీక్రెట్ ఎంట్రీ!

బిగ్ బాస్ ఫైనల్స్ కు హాజరు కావాలని ఆహ్వానం పంపారు. కానీ మరోమారు వెళ్లి అవమానపడడం నావల్ల కాదు. అందుకే ఫైనల్స్ కు నేను వేళ్లను అని హేమ తేల్చేసింది. నన్ను తొలి వారమే ఇంటి నుంచి పంపించివేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే అనవసరమైన విషయాలకు కూడా ప్రతి ఒక్కరూ నాతో గొడవ పెట్టుకున్నారు అని హేమ ఆరోపించారు.

 

బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ కాగానే హేమ నిరాశ వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా హేమ టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు. హేమ మరికొన్ని రోజులు హౌస్ లో ఉండాల్సింది అని అభిప్రాయపడ్డ అభిమానులు ఉన్నారు. అదే సమయంలో హేమని త్వరగా ఎలిమినేట్ చేయాలంటూ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగింది.