బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో ఆరుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. ఈ వారం హౌస్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారు. శనివారం నాడు నాగార్జున గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు. ముందుగా బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో లగ్జరీ బడ్జెట్ కోసం ఆ టాస్క్ ఆడించారు. అనంతరం నాగార్జున మన టీవీ ద్వారా హౌస్ మేట్స్ ని పలకరించారు. శ్రీముఖి, శివజ్యోతిలు లంగావొణీల్లో బాగున్నారని కాంప్లిమెంట్ ఇచ్చిన నాగార్జున మెల్లగా హౌస్ మేట్స్ కి క్లాస్ పీకడం మొదలుపెట్టారు.

ముందుగా టికెట్ టు ఫినాలే గెలుచుకొని ఫైనల్ కి చేరుకున్న రాహుల్ ని అభినందించారు నాగ్. ఆ తరువాత రాహుల్ గతంలో శ్రీముఖి తనను బిగ్ బాస్ షోకి రికమండ్ చేసిందని చేసిన ఆరోపణలు నిజం కావని  వీడియో ప్లే చేసి చూపించారు నాగ్. లేని విషయాలను ఉన్నట్లుగా ఊహించుకొని అనవసరంగా ఛాలెంజ్ లు చేస్తున్నావని నాగార్జున.. రాహుల్ కి క్లాస్ తీసుకున్నారు. 

రాహుల్ తో శ్రీముఖికి క్షమాపణలు చెప్పించారు. ఆ తరువాత బాబా గతంలో రాహుల్ విన్నర్ అంటూ చేసిన కామెంట్స్ పై నాగార్జున మాట్లాడారు. అలాంటి అపోహలు పెట్టుకోవద్దని.. ప్రేక్షకుల ఓటింగ్ బట్టి విజేతని నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చాడు. ఇక ఈ వారం నామినేషన్స్ ఉన్నవారిలో ఎవరు సేవ్ అయ్యారో తెలుసుకోవడానికి నాగార్జున హౌస్ మేట్స్ కి ఓ టాస్క్ ఇచ్చాడు.

ఒక్కొక్కరికీ పోపర్స్ గన్ ఇచ్చి పేల్చమని చెప్పారు. ఎవరి గన్ నుండి రంరంగుల కాగితాలు బయటకొస్తాయో.. వారు సేవ్ అవుతారని చెప్పారు. ఈ ప్రాసెస్ లో ముందుగా వరుణ్, అలీ గన్ పేల్చగా.. వాటిల్లో ఎలాంటి రంగులు రాలేదు. ఇక శివజ్యోతి, శ్రీముఖి వారి చేతుల్లో ఉన్న గన్‌లను పేల్చలేకపోయారు. రెండో ప్రయత్నంలో శ్రీముఖి గన్‌ పేల్చగా.. దాట్లోంచి రంగుల కాగితాలు వచ్చాయి.

దాంతో శ్రీముఖి సేవ్‌ అయి టికెట్‌ టు ఫినాలేకు చేరుకున్నట్టు  నాగ్‌ ప్రకటించాడు.మిగిలిన ముగ్గురు వరుణ్‌, శివజ్యోతి, అలీరెజాలలో ఒకరు ఆదివారం నాడు ఎలిమినేట్ కానున్నారు.