మెగా పవర్ స్టార్ రాంచరణ్ కోసం దర్శకుడు క్యూ కడుతున్నారు. కానీ చరణ్ మాత్రం ఆర్ఆర్ఆర్ షూటింగ్ పూర్తయ్యే వరకు మరో చిత్రాన్ని అంగీకరించే పరిస్థితి కనిపించడం లేదు. రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో స్వాతంత్ర సమరయెధుడు అల్లూరి సీతా రామరాజు పాత్రలో చరణ్ నటిస్తుండడం విశేషం. 

ఇదిలా ఉండగా రాంచరణ్ తో సినిమా చేసేందుకు వంశీ పైడిపల్లి, క్రిష్ జాగర్లమూడి లాటి దర్శకులు ప్రయత్నిస్తున్నారు. ఆ జాబితాలోకి మాస్ చిత్రాల దర్శకుడు హరీష్ శంకర్ చేరినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ రీసెంట్ గా గద్దలకొండ గణేష్ చిత్రంతో సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. 

స్టార్ హీరోల ఇమేజ్ కు తగ్గట్లుగా మాస్ కథలు చిత్రీకరించడంలో హరీష్ శంకర్ దిట్ట. మిరపకాయ్, గబ్బర్ సింగ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, డీజే లాంటి విజయవంతమైన చిత్రాలని హరీష్ శంకర్ చిత్రీకరించారు. ప్రస్తుతం హరీష్ రాంచరణ్ కోసం ఓ కథ సిద్ధం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చరణ్ ని డిఫెరెంట్ యాంగిల్ లో ప్రాజెక్ట్ చేస్తూ అన్ని మాస్ అంశాలు ఉండేలా హరీష్ ఈ కథ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. 

'ఎంతైనా పవన్ రక్తం కదా..' మండిపడ్డ రేణుదేశాయ్!

గతంలో కూడా రాంచరణ్ మాస్ కథలలో నటించాడు. ఆ చిత్రాలన్నింటికంటే ఈ చిత్రం విభిన్నంగా ఉంటుందట. ఒకరకంగా హరీష్ రాంచరణ్ తో ప్రయోగం చేయబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం హరీష్, చరణ్ మధ్య ప్రాధమిక చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. హరీష్ కథతో రాంచరణ్ ని ఇంప్రెస్ చేస్తే ఆర్ఆర్ఆర్ తర్వాత ఈ చిత్రం పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఎన్టీఆర్ పై రూమర్స్ అవాస్తవం.. మహేష్ సినిమా అందుకే ఫ్లాప్!