నటి రేణుదేశాయ్.. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయి ప్రస్తుతం తన ఇద్దరి పిల్లలతో కలిసి జీవిస్తోంది. త్వరలోనే తన మనసుకి దగ్గరైన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతుంది. రేణు తన పిల్లలను ఎంతో ప్రేమిస్తుంది.

ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. తాజాగా మరో ఫోటో పోస్ట్ చేసింది. ఇందులో అకీరా తన చెల్లెలు ఆద్యని ఎత్తుకొని ఉన్నాడు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. 'ఆద్య, అకీరా క్రేజీ ఫెల్లోస్.. వారిద్దరూ నా సొంతం' అంటూ క్యాప్షన్ ఇచ్చింది.

వాళ్ల వరసలకి మా రొమాన్స్ తో సంబంధం లేదు..

ఈ ఫోటోకి ఓ నెటిజన్ 'ఎంతైనా పవన్ రక్తం కదా' అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి రేణు తనదైన స్టైల్ లో రిప్లై ఇచ్చింది. 'టెక్నికల్ గా వారిద్దరిలో ప్రవహించేది నా రక్తం.. మీకు సైన్స్ తెలిస్తే ఈ మాటకి అర్ధం తెలుస్తుంది' అని సమాధానమిచ్చింది. ఇది చూసిన మరో నెటిజన్ 'ఫ్యాన్స్ తో ఇంత దురుసుగా వ్యవహరిస్తే ఎలా..?' అని ప్రశ్నించాడు.

దీనికి రేణు మండిపడింది. 'ఫ్యాన్ నాలో ఉన్న అమ్మతనం గురించి దురుసుగా మాట్లాడొచ్చా' అని ఎదురు ప్రశ్నించింది. గతంలో కూడా పవన్ అభిమానులు అకీరాని ఉద్దేశిస్తూ జూనియర్ పవర్ స్టార్ అని పిలిచేవారు.

ఈ విషయం అకీరాకి నచ్చదని.. అకీరాని పవన్ తో పోల్చకండి అంటూ రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది. అయినప్పటికీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అకీరాని ఇప్పటికీ అలానే పిలుచుకుంటారు. అతడు సినిమాల్లోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడా..? అని ఎదురుచూస్తున్నారు.