సీనియర్ నటుడు గొల్లపూడి మారుతీరావు అనారోగ్యం కారణంగా గురువారం రోజు మరణించిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతున్న మారుతీరావు చెన్నైలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మారుతీరావు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో బహుముఖప్రజ్ఞాశాలిగా పేరు గాంచారు. 

రచయితగా, ప్రత్రికా సంపాదకుడిగా ఎంతో కీర్తిని సంపాందించిన గొల్లపూడి 1982లో ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా మారారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆ చిత్రం గొల్లపూడి నటుడిగా మంచి పేరు తీసుకువచ్చింది. ఆ తర్వాత గొల్లపూడి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అనేక చిత్రాలకు రచయితగా పనిచేశారు. 

గొల్లపూడి జీవితంలో విషాద ఘటన.. అజిత్ తో సినిమా తీస్తూ కుమారుడి మృతి

నేడు గొల్లపూడి కుటుంబసభ్యులు ఆయన భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించారు. విదేశాల్లో ఉన్న గొల్లపూడి మనవడు, మనవరాళ్లు చెన్నైకి చేరుకోవడంతో అంత్యక్రియలని కొద్దిసేపటి క్రితమే నిర్వహించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత సురేష్ బాబు, దిగ్గజ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఇతర సెలెబ్రిటీలు గొల్లపూడి చివరిసారి నివాళులు అర్పించారు. 

రత్నాన్ని కోల్పోయాం.. గొల్లపూడి మృతికి మహేష్ బాబు, అనుష్క సంతాపం!

గొల్లపూడి తన ఆత్మబంధువు అని బాలసుబ్రమణ్యం ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకోవడమే కాదు.. ఇండస్ట్రీలో మంచి క్రమశిక్షణ కలిగిన వారిలో గొల్లపూడి ఒకరు అని సురేష్ బాబు అన్నారు. సుహాసిని, భానుచందర్ లాంటి సినీ ప్రముఖులంతా గొల్లపూడి తుది వీడ్కోలు పలికారు. 

గొల్లపూడి మృతి: మెగాస్టార్ సూపర్ హిట్ తో ఎంట్రీ.. ఆరు నందులు కైవసం!

సంసారం ఒక చదరంగం, గూఢచారి నెం 1, అభిలాష, కంచె, మురారి, లీడర్, దరువు లాంటి ఎన్నోఅద్భుత చిత్రాల్లో గొల్లపూడి నటించారు.