డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తనయుడు ఆకాష్ పూరి టాలీవుడ్ లో హీరోగా రాణించే ప్రయత్నం చేస్తున్నాడు. ఆకాష్ పూరి చివరగా నటించిన చిత్రం మెహబూబా తీవ్రంగా నిరాశపరిచింది. పూరి దర్శకత్వంలోనే ఈ చిత్రం తెరకెక్కింది. ప్రస్తుతం ఆకాష్ పూరి 'రొమాంటిక్' అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

ఇటీవల చిత్ర పరిశ్రమలో సెలెబ్రిటీల నకిలీ ఖాతాలతో ఆన్ లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. తాము పలానా సెలెబ్రిటీ అని చెప్పుకుంటూ కొందరు వ్యక్తులు సైబర్ నేరాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆకాష్ పూరి పేరుతో ఓ వ్యక్తి నకిలీ సోషల్ మీడియా ఖాతా ఓపెన్ చేసి కొందరు యువతులని మోసం చేసే ప్రయత్నం చేశాడు. చివరకు అతడి బండారం బయట పడింది. 

తాను ఆకాష్ పూరి అని భ్రమింపజేసేలా ఓ యువకుడు ట్విట్టర్ ఖాతా తెరిచాడు. నిజంగానే ఆకాష్ పూరి అని భ్రమపడ్డ కొందరు యువతులు ఆ ఖాతాని ఫాలో అయ్యారు. దీనితో అతడు ఆ అమ్మాయిలని వలలోకి దింపేందుకు ప్రయత్నించాడు. 

చివరకు ఓ బాధితురాలు అతడు ఆకాష్ పూరి కాదని, ఫేక్ అకౌంట్ అని గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనితో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువకుడి నుంచి హార్డ్ డిస్క్, పలు పెన్ డ్రైవ్ లు స్వాధీనం చేసుకున్నారు. 

'దూకుడు'పై నాకు డౌట్ ఉండేది.. ఎప్పుడూ చేయని పని చేశా.. శ్రీను వైట్ల!

ఆకాష్ పూరి చైల్డ్ ఆర్టిస్ గా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. గబ్బర్ సింగ్, చిరుత లాంటి చిత్రాల్లో నటించాడు. ప్రస్తుతం హీరోగా మారి సినిమాలు చేస్తున్నాడు. హీరోగా ఫస్ట్ సక్సెస్ కోసం ఆకాష్ పూరి 'రొమాంటిక్' చిత్రంతో గట్టి ప్రయత్నమే చేస్తున్నాడు. 

హీరోయిన్ సెక్సీ డాన్స్, వీడియో వైరల్.. నెటిజన్ల ట్రోలింగ్!