సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈసారి సంక్రాంతి బరిలో గట్టి పోటీనే ఉండబోతోంది. సంక్రాంతి కానుకగా సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో, దర్బార్ లాంటి బడా చిత్రాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయి.  మహేష్ బాబు, రష్మిక జంటగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. 

సంక్రాంతి చిత్రాల సందడి మొదలైపోయింది. ప్రచార కార్యక్రమాలు జోరుగా జరుగుతున్నాయి. ఇటీవలే సరిలేరు నీకెవ్వరు చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేసుకుంది. చిత్ర యూనిట్ ఒక్కో విశేషాన్ని రివీల్ చేస్తూ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. 

దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన పాటలకు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో మహేష్ కోసం దేవిశ్రీ మైండ్ బ్లాక్ అనే మాస్ బీట్ ని రెడీ చేశాడు. ఈ సాంగ్ లో మహేష్ బాబు లుంగీ గెటప్ లో కనిపించబోతున్నాడు. ఈ సాంగ్ గురించి ఆశ్చర్యాన్ని కలిగించే వార్త బయటకు వచ్చింది. 

హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్.. ఫోటోలపై క్లారిటీ ఇదే!

ఈ ఒక్క సాంగ్ కోసం నిర్మాతలు దాదాపు 9 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ కోసం ప్రత్యేకంగా కాస్ట్లీ సెట్ ని నిర్మించారట. 9 రోజుల పాటు షూట్ చేసిన ఈ సాంగ్ కోసం ఏకంగా 9 కోట్లు ఖర్చు చేయడం ఆశ్చర్యకరమే. కానీ ఈ పాట మహేష్ అభిమానులకు మధురానుభూతిగా మిగిలిపోవాలని అనిల్ రావిపూడి భావించినట్లు తెలుస్తోంది. ఈ సాంగ్ లో మహేష్ బాబు మాస్ స్టెప్పులతో అలరించబోతున్నాడు. 

RRR: 'రామ రావణ రాజ్యం'.. క్రేజీ టైటిల్ మిస్సైన రాజమౌళి!

ఆర్మీ మేజర్ గా మహేష్ బాబు ఈ చిత్రంలో నటిస్తున్నాడు. కనై హీరో పాత్రని కర్నూలు ఫ్యాక్షన్ తో దర్శకుడు లింక్ పెట్టాడు. ఈ అంశమే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.