మలయాళీ హీరోయిన్ రమ్య నంబీశన్ కు తెలుగు ప్రేక్షకుల్లో అంతగా గుర్తింపు లేదు. ఆమె తెలుగులో కొన్ని చిత్రాల్లో మాత్రమే నటించింది. అవి కూడా తక్కువ బడ్జెట్ లో తెరకెక్కి ఇలా వచ్చి అలా వెళ్లిపోయిన చిత్రాలు. మళయాలంలో మాత్రం రమ్య నంబీశన్ వరుస చిత్రంలో నటిస్తోంది. 

రమ్య నంబీశన్ తమిళంలో కూడా కొన్ని చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రమ్య చేతుల్లో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి. వరుస చిత్రాలతో బిజీగా గడుపుతున్న రమ్యని కంగారు పెట్టేలా ఓ వార్త వైరల్ అయింది. రమ్య సాంప్రదాయ బద్దంగా పట్టుచీర ధరించి ఉన్న ఫోటోలు కొన్ని సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. 

రమ్య సడెన్ గా ఇలా ట్రెడిషనల్ లుక్ లో కనిపించడంతో పుకార్లు మొదలయ్యాయి. ఈ 33 ఏళ్ల హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్ చేసుకుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ వార్త కాస్త వైరల్ కావడంతో రమ్య స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

తనకు వివాహం జరిగింది అంటూ జరుగుతున్న ప్రచారం అవాస్తవం అని తేల్చేసింది. నాకు పెళ్లయిందా.. ఎప్పుడు.. ఎక్కడ.. నాకు తెలియకుండా నా వివాహం జరుగుతుందా.. అలాంటిది ఏమీ లేదు. నాకు పెళ్లయ్యిందంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. 

ఫ్యాన్స్ కు పండగే.. 'సరిలేరు నీకెవ్వరు' ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ ?

నేను పట్టుచీరలో కనిపిస్తున్న ఈ ఫోటోలు ఓ చిత్రానికి సంబంధించినవి అని రమ్య క్లారిటీ ఇచ్చింది. రమ్య నంబీశన్ తెలుగులో నువ్విలా, తెలుగబ్బాయి లాంటి చిత్రాల్లో నటించింది.