కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఇండియన్ 2 సెట్స్ లో గత బుధవారం ఘోరప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. పలువురు గాయాలపాలయ్యారు. దర్శకుడు శంకర్ స్వల్ప గాయాలతో బయటపడ్డట్లు తెలుస్తోంది. 

శంకర్ వ్యక్తిగత సహాయకుడు, అసిస్టెంట్ డైరెక్టర్, ఫుడ్ సప్లయిర్ ఇలా ముగ్గురు సిబ్బంది మరణించారు. చెన్నై సమీపంలోని ఈవిపి స్టూడియోలో షూటింగ్ జరుగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. భారీ క్రేన్ విరిగి పడడంతో ఈ ఘోరం జరిగింది. నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, కమల్ హాసన్ ఇప్పటికే స్పందించారు. మృతుల కుటుంబాలకు కమల్ రూ కోటి విరాళం కూడా ప్రకటించారు. 

ఎట్టకేలకు ఈ ప్రమాదంపై దర్శకుడు శంకర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చాలా ఎమోషనల్ గా శంకర్ ఈ ట్వీట్ చేశారు. 'తీవ్రమైన శోకంతో స్పందిస్తున్నా.. ఆ ప్రమాదం జరిగినప్పటి నుంచి కనీసం నిద్ర కూడా లేకుండా షాక్ లో ఉన్నా.  నా సిబ్బందిని కోల్పోయాను. ప్రమాదం నుంచి నేను తృటిలో తప్పించుకున్నా. ఇంత ఘోరం జరిగే బదులు ఆ క్రేన్ నా మీద పడుంటే బావుండేది అనిపిస్తోంది. వారి కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి' అని శంకర్ ట్వీట్ చేశారు.  

ఇండియన్ 2 ప్రమాదం.. శంకర్ పై సీనియర్ నటుడి విమర్శలు!

శంకర్ ఎమోషనల్ గా స్పందించడంతో.. అభిమానులంతా కామెంట్స్ చేస్తున్నారు. 'అలా మాట్లాడకండి.. మీరు ధైర్యంగా ఉండాలి.. ప్రమాదం నుంచి కోలుకుని విజయాలు సాధించాలి అంటూ అభిమానులు శంకర్ ట్వీట్ కు కామెంట్స్ చేస్తున్నారు. వారి మీద పడే బదులు.. ఆ క్రేన్ తనమీద పడితే బావుండేది అన్నారంటే శంకర్ ఎంత బాధలో ఉన్నారో అర్థం అవుతోంది అంటూ రిప్లై ఇస్తున్నారు. 

ఇండియన్ 2 ప్రమాదం: కమల్ హాసన్, కాజల్ ఇద్దరూ.. 10 సెకండ్లే తేడా..

దాదాపు పాతికేళ్ల క్రితం వచ్చిన భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా భారతీయుడు 2 చిత్రాన్ని ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ మొదలైనప్పటి నుంచి అన్నీ అడ్డంకులే ఎదురవుతున్నాయి. శంకర్ అనుకోగానే ఈ చిత్రం ప్రారంభం కాలేదు. ఎన్నో సమస్యలని అధికమించి శంకర్ ఈ చిత్ర షూటింగ్ ప్రారంభించారు. షూటింగ్ బాగా జరుగుతోంది అనుకుంటున్నా తరుణంలో ఈ ఘోరం జరిగింది. ఈ ప్రమాదం నుంచి కమల్ హాసన్, తాను వెంట్రుక వాసిలో తప్పించుకున్నట్లు కాజల్ తెలిపిన సంగతి తెలిసిందే.