బుధవారం రాత్రి శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 చిత్ర సెట్స్ లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. దేశం మొత్తాన్ని ఈ సంఘటన కలచి వేసింది. సినీ అభిమానులు షాక్ కి గురికాగా, సెలెబ్రిటీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. షూటింగ్ లొకేషన్ లో లైటింగ్ సెటప్ ఏర్పాటు చేస్తున్న భారీ క్రేజ్ విరిగి పడడంతో మధు. సాయి కృష్ణ, చంద్రన్ అనే ముగ్గురు సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందారు. 

దర్శకుడు శంకర్ తో పాటు పలువురు గాయాలపాలయ్యారు. కమల్ హాసన్, కాజల్ అగర్వాల్ ఈ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకుని బయట పడ్డారు. దర్శకుడు శంకర్ చిత్రాల్లో ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇలాంటి ఎన్నో భారీ చిత్రాలని శంకర్ విజయవంతంగా చిత్రీకరించారు. కానీ ఇప్పుడు టైం కలసి రాలేదు. 

'ఇండియన్ 2' ప్రమాదం.. కమల్, శంకర్‌లకు సమన్లు..!

ఇదిలా ఉండగా చిత్ర యూనిట్ తగు జాగ్రత్త చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందనే విమర్శలు తలెత్తుతున్నాయి. ఈ  ప్రమాదానికి సంతాపంగా తమిళ చిత్ర పరిశ్రమ ఓ సభ ఏర్పాటు చేసింది. ఈ సభకు సీనియర్ నటుడు రాధా రవి కూడా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ పరోక్షంగా శంకర్ పై విమర్శలు చేశారు. 

దర్శకులు హాలీవుడ్ స్థాయిలో సినిమాలు చేయాలనుకుంటారు.. కానీ నటీనటులు, సిబ్బంది భద్రతని మాత్రం పట్టించుకోరు అని కామెంట్స్ చేశారు. పోలీసులు ఇప్పటికే నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్, కమల్ హాసన్, శంకర్ లకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.