టీమిండియా మాజీ కెప్టెన్, ప్రస్తుతం బీసీసీఐ అధ్యక్షుడిగా వ్యవహరిస్తున సౌవర్ గంగూలీ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నాడు. ఇండియన్ క్రికెట్ చరిత్రలో సూపర్ కెప్టెన్ గా గుర్తింపు సొంతం చేసుకున్న గంగూలీ ప్రస్తుతం బిసిసిఐ అధ్యక్షుడిగా కీలక భాద్యతలు నిర్వహిస్తున్నాడు. 

గంగూలీ కుమార్తె సనా ఇటీవల బిజెపికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో కామెంట్స్ చేశారు. బిజెపి ప్రభుత్వం తీసుకువచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సనా వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆమె మీడియాలో హాట్ టాపిక్ గా నిలిచారు. కొందరు ఆమెకు మద్దతుగా నిలిస్తే.. మరికొందరు ట్రోల్ చేశారు. 

దీనితో గంగూలీ రంగంలోకి దిగి డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. సనా చిన్న పిల్ల.. ఆమెకు రాజకీయాల గురించి మాట్లాడేంత వయసు లేదు.  ఏదో పొరపాటుగా ఆ కామెంట్స్ చేసి ఉంటుంది. దయచేసి దీని వివాదం చేయకండి అని గంగూలీ కోరారు. 

తాజాగా ఈ వివాదంపై గంగూలీ మాజీ ప్రియురాలు నగ్మా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. నగ్మా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ నేతగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సనా విషయంలో ఆమె గంగూలీ తీరుని తప్పు బట్టారు. గంగూలీ కుమార్తె ఓ అభిప్రాయాన్ని చెప్పారు. దానికి గంగూలీ ఎందుకు స్పందించాలి. ఆమె అభిప్రాయాలని ఓ తండ్రిగా గౌరవించాలి. 

ఆమెకు కూడా దేశంలో జరుగుతున్న రాజకీయాలు తెలియాలి. ఆమె భవిష్యత్తులో  ఓటు వేయాలంటే తనకంటూ రాజకీయాలపై నిర్దిష్టమైన అభిప్రాయం ఉండాలి. ధైర్యంగా తన అభిప్రాయం చెప్పినందుకు నేను సనాకు కంగ్రాట్స్ చెబుతున్నా. ఇకమీదట కూడా ఆమె తన అభిప్రాయాలని చెప్పే స్వేచ్చని గంగూలీ కల్పించాలి అని నగ్మా అన్నారు. 

2000 ఆరంభంలో గంగూలీ, నగ్మా మధ్య హాట్ ఎఫైర్ సాగింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగితేలారు. ఆ మధ్యన నగ్మా.. గంగూలీతో తన ప్రేమ వ్యవహారం గురించి కూడా ఓపెన్ అయింది. గంగూలీ కుటుంబం కోసమే తాను అతడి జీవితం నుంచి తప్పుకున్నానని నగ్మా కామెంట్ చేసింది.