నవంబర్ 27న వైద్యురాలు దిశని నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేసి, ఆమెని సజీవదహనం చేశారు. ఇంతటి దారుణానికి పాల్పడిన నలుగురు నిందితులని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటనని యావత్ దేశం ముక్త కంఠంతో ఖండించింది. నిందితులకు మరణ శిక్ష విధించాలని ప్రజలంతా డిమాండ్ చేశారు. 

సినీ రాజకీయ ప్రముఖులంతా దిశ హత్యని ఖండిస్తూ సోషల్ మీడియాలో గళం వినిపించారు. నిందితులకు వెంటనే మరణశిక్ష విధించాలనే డిమాండ్ రోజు రోజుకూ పెరుగుతూ పోయింది. కానీ పోలీసులు మాత్రం నిందితులని కోర్టుకు హాజరుపరచడం, విచారణ చేపట్టడం లాంటి అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. 

justice for disha : 'ఇదొక ఉదాహరణ' అక్కినేని హీరోల కామెంట్స్!

కానీ ఊహించని విధంగా నేడు(శుక్రవారం తెల్లవారుజామున) పోలీసులు నిందితులని ఎన్ కౌంటర్ చేశారు. పోలిసుల కాల్పుల్లో నలుగురు నిందితులు మరణించారు. పోలీసులు చర్యపై సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. సెలెబ్రిటీలంతా హైదరాబాద్ పోలీసులని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో స్పందిస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందని అంటున్నారు. 

సౌత్ ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. 'నిందితులపై తగిన చర్య తీసుకున్న హైదరాబాద్ పోలీసులకు నా సెల్యూట్. ఈ దేశంలో ప్రతి మహిళ సురక్షితంగా జీవించే రోజు కోసం ఎదురుచూస్తున్నా' అని మురుగదాస్ ట్వీట్ చేశారు. 

'ఇండియా మొత్తం వినిపించాలి'.. టాలీవుడ్ హీరోల పోస్ట్ లు!

టాలీవుడ్ సెలెబ్రిటీలంతా దిశకు తగిన న్యాయం జరిగిందంటూ స్పందిస్తున్నారు. ఎన్టీఆర్, రవితేజ, నాగార్జున, పూరి జగన్నాధ్ లాంటి సెలెబ్రిటీలంతా నిందితులని ఎన్ కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.