‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు.  

గత నెల 29వ తేదీన వెటర్నరీ డాక్టర్ దిశను నలుగురు కిరాతకులు అత్యంత పాశవికంగా పథకం ప్రకారం... ఆమెను ట్రాప్ చేసి... అత్యంతకిరాతకంగా అత్యాచారానికి పాల్పడి.. అనంతరం సజీవదహనం చేశారు. అయితే.. ఎక్కడైతే దిశను సజీవదహనం చేశారో... అదే స్థలంలో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

‘దిశ’ హత్యాచార నిందితులను కఠినంగా శిక్షించాలని, వారిని ఉరి తీయాలని తెలుగురాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రజలు ముక్తకంఠంతో డిమాండు చేస్తున్న నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున ఆ కామాంధులు పోలీసుల చేతిలో ఎన్‌కౌంటర్‌కు గురయ్యారు. ఈ నేపధ్యంలో సినీ సెలబ్రిటీలు, మహిళా నేతలు, రాజకీయ నాయకులు దిశకు ఆత్మశాంతి లభించిందని వ్యాఖ్యానించారు. 

Justice for disha:'ఆడవాళ్లు సర్.. అమ్మలు సర్..' ఉత్తేజ్ కామెంట్స్!

ఈ క్రమంలో సినీ నటులు ఒక్కొక్కరుగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. యంగ్ హీరో రామ్.. ఇండియా మొత్తం వినపడాలి అంటూ దిశకి న్యాయం జరిగిందని అన్నారు. అలానే మరో హీరో నిఖిల్.. 'మానవ హక్కులు మానవుల కోసం.. వికృత జంతువుల కోసం కాదు.. చట్టాలు మన చేతే తయారు చేయబడి, పోలీసు శాఖ చేత అమలు చేయబడ్డాయి.. ఇలా చేయడం వలన మరికొంతమంది మహిళలు ప్రాణాలు కోల్పోకుండా ఉంటారు' అంటూ రాసుకొచ్చారు. 

Scroll to load tweet…
Scroll to load tweet…