యంగ్ హీరో నితిన్ నటించిన భీష్మ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఇక నితిన్ వరుస ఫ్లాపులకు ఈ చిత్రం అడ్డుకట్ట వేసింది. దీనితో కొత్త పెళ్లి కొడుకు నితిన్ యమ జోష్ లో ఉన్నాడు. పెళ్లికి ముందు తాను నటించిన చిత్రాలు హిట్ కావడంతో నితిన్ సంతోషానికి అవధులు లేకుండా ఉంది. 

కానీ తాజాగా నితిన్ తో పాటు, అతడి కుటుంబ సభ్యులు కూడా టెన్షన్ కు గురవుతున్నారు. వారి టెన్షన్ అంతా నితిన్ పెళ్లి విషయంలోనే. ప్రస్తుతం కరోనా వైరస్ ప్రపంచ దేశాలని వణికిస్తోంది. చైనాలో మొదలైన కరోనా వేగంగా ప్రపంచ దేశాలకు పాకింది. ఇండియాలో కూడా కొన్ని కేసులు నమోదైన సంగతి తెలిసిందే. 

చైనాతో పాటు దుబాయ్ లో కూడా భారీ స్థాయిలోనే కరోనా కేసులు నమోదయ్యాయి. నితిన్ పెళ్లి ఏప్రిల్ 16న దుబాయ్ లో జరగాల్సి ఉంది. దుబాయ్ లో ప్రస్తుతం కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో దుబాయ్ లో నితిన్, షాలినిల వివాహం జరుగుతుందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

పెళ్లి తేదీని ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేయకుండా అనుకున్న ముహూర్తంకే వివాహం జరిగేలా కుటుంబ సభ్యులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వేళ దుబాయ్ లో వివాహం వీలు కాకుంటే అదే ముహూర్తానికి హైదరాబాద్ లో పెళ్లి జరిగేలా ముందుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ప్రగతి, పవిత్రని ఏకిపారేసిన నటి సుధ.. మహేష్ సినిమానే రిజెక్ట్ చేశా

హైదరాబాద్ నగర శివారులో ఓ ఫామ్ హౌస్ లో నితిన్, షాలిని పెళ్లి ఏర్పాట్లకు కుటుంబ సభ్యులు సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరో రెండు మూడు వారాల్లో దుబాయ్ లో పరిస్థితులని బట్టి నితిన్ వివాహ వేదికపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. 

బికినీ సీన్లకు దూరం.. అయినా ఇంత క్రేజా.. అది ఈ హీరోయిన్లకు మాత్రమే సాధ్యం

ఇప్పటికే నితిన్, షాలిని చెన్నై, కంచిలో పెళ్లి వస్త్రాల షాపింగ్ చేశారు. గత నాలుగేళ్లగా నితిన్, షాలినిలు ప్రేమలో ఉన్నారు. వీరి ప్రేమకు పెద్దలు అంగీకారం తెలపడంతో వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నారు. షాలిని నగర్ కర్నూల్ లోని సంపత్ కుమార్, నూర్ జహాన్ అనే దంపతుల కుమార్తె. ఆమె తల్లి దండ్రులు ఇద్దరూ డాక్టర్లే.