హైదరాబాద్: తెలుగు సినీ హీరో ప్రభాస్ సెల్ప్ క్వారంటైన్ లోకి వెళ్లారు. ఇటీవలే ఆయన విదేశాల నుంచి తిరిగి వచ్చారు. కోవిడ్ 19 విస్తరిస్తున్న నేపథ్యంలో తాను సురక్షితంగా తిరిగి వచ్చానని ప్రభాస్ చెప్పారు. 

  ప్రపంచ వ్యాప్తంగా ప్రస్తుతం కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తూ జనాలని భయ భ్రాంతులను చేస్తోంది.  ఈ నేపధ్యంలో అందరూ తగినన్ని జాగ్రత్తలు తీసుకోవటమే కాక, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కాను... ఇంట్లోనే కూర్చుంటున్నారు అంతా. 

ప్రభుత్వాలు కూడా ముందడగు వేసి విద్యాసంస్థలతో పాటు మాల్స్, థియేటర్స్ అన్నీ మూసేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. ఈ నేపధ్యంలోనే సినిమా షూటింగ్స్ కూడా ఆపేసారు. అయితే వీటిని లెక్క చేయకుండా, ఏ మాత్రం పట్టించుకోకుండా జార్జియాలో షెడ్యూల్ పూర్తి చేసుకుని వచ్చారు ప్రభాస్ అండ్ టీం.  

Also read; కరోనా ఎఫెక్ట్:క్వారంటైన్ కు వెళ్లిన 'కంచె' హీరోయిన్

విదేశాల నుంచి తిరిగి వచ్చిన నేపథ్యంలో సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు ప్రభాస్ చెప్పారు. రక్షణ కోసం మీరంతా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.

జార్జియాలో సినిమా షూటింగ్ ముగించుకుని ఆయన ఇటీవల హైదరాబాదు తిరిగి వచ్చారు. ప్రభాస్, ఇతర సినీ జట్టులో ఉన్న కమెడియన్ ప్రయదర్శి కూడా సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లారు.

సినిమా షూటింగ్ ముగించుకొని హైదరాబాద్ వచ్చిన  ప్రియదర్శి శంషాబాద్ విమానాశ్రయంలో కరోనా వైరస్ స్ర్కీనింగ్ అనంతరం ఇంట్లోనే ఉండిపోయారు. 

Also read: కరోనా పోవాలంటే సెక్స్ అవసరం.. శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్

తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకునేందుకు బాధ్యతగా 14రోజులు ప్రజలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రియదర్శి ట్విట్టర్ ద్వారా తెలిపారు. ప్రియదర్శి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. 

ప్రస్తుతం  ప్రభాస్.. రాధాకృష్ణ దర్శకత్వంలో ఒక పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. ఈ సినిమాను యూరప్ నేపథ్యంలో 1970-80ల నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. తాాజాగా ఈ సినిమాకు సంబంధించిన జార్జియా షెడ్యూల్ కంప్లీటైంది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించాడు. జార్జియన్‌ల సహాయంతో ఈ షెడ్యూల్ త్వరగా పూర్తైయిందన్నారు. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు