వరుణ్ తేజ హీరోగా ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కంచె చిత్రం  గుర్తుండే ఉండి ఉంటుంది. అందులో నటించిన ప్రగ్యా జైస్వాల్ సైతం అందరినీ తన నటన, అందంతో ఆకట్టుకుంది. అయితే ఆమె తెలుగులో సినిమాలు ఏమీ చెయ్యకపోవటంతో వార్తలేమీ వినిపించటంలేదు. అయితే ఇప్పుడు ఆమె స్వయంగా క్వారంటైన్ కు వెళ్లటంతో వార్తల్లోకి వచ్చింది. 

కరోనా విజృంభించినప్పటి నుంచీ ప్రపంచవ్యాప్తంగా క్వారంటైన్‌ (నిర్బంధంగా దూరంగా ఉండటం) ఐసొలేషన్‌ (ఒంటరిగా ఉంచడం) లాంటి మాటలు తరచూ వినిపిస్తున్నాయి. వైరస్‌ వ్యాప్తిని అరికట్టాలంటే వీటిని పాటించాల్సిందేనని అన్ని దేశాలూ నొక్కిచెబుతున్నాయి. 

 వైరస్‌ విస్తృతంగా వ్యాపించిన దేశాన్ని సందర్శించిన లేదా, వ్యాధిగ్రస్తుడికి దగ్గరగా మసలుకున్న వ్యక్తులు ఆ వైరస్‌కు ప్రభావితమై ఉంటారనే కారణంతో బలవంతంగా దిగ్బంధంలో ఉంచడం లేదా స్వీయ దిగ్బంధం విధించుకోవడం క్వారంటైన్‌. కదలికల్ని నియంత్రించడం దీని ముఖ్య ఉద్దేశం. ఫ్లూ లక్షణాలు కనిపించినపుడు కనీసం 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలని వైద్యాధికారులు సూచిస్తారు. ఇప్పుడు ప్రగ్నా జైస్వాల్ స్వీయ దిగ్బంధం విధించుకుంది.

 ఎందుకంటే...ప్రగ్నా..హాలీడే ట్రిప్ కు విదేశాలకు వెళ్లింది. కరోనా వైరస్ వ్యాప్తితో విదేశాల నుంచి వచ్చినవారు తామే స్వయంగా 14 రోజులు క్వారంటైన్‌లో ఉంటున్నారు. అదే విధంగా ప్రగ్నా కూడా చేసింది. అయితే ఆమెకు బోర్ కొట్టినట్లుంది. ఈ విషయం తెలియచేస్తూ ఓ సెక్సీ ఫొటోని  ఇనస్ట్రాలో అప్ లోడ్ చేసి... క్వారంటైన్‌లో మొదటి రోజు,నేను హాలీడే సిక్ లో ఉన్నాను ఆల్రెడీ అంటూ పోస్ట్ చేసింది.

 ప్రగ్న ..కంచె చిత్రం తర్వాత ఓం నమో వెంకటేశాయ, నక్షత్రం, గుంటూరోడు, జయ జానికీ నాయక వంటి సినిమాలు చేసింది. అయితే ఆమె కెరీర్ ఊహించినంత గొప్పగా సాగలేదు. దాంతో ఖాళీ పడిపోయింది.