ప్రస్తుతం వెండితెరపై, డిజిటల్ మార్కెట్ లో అడల్ట్ కంటెంట్ చిత్రాలు ఎక్కువవుతున్నాయి. డబుల్ మీనింగ్ డైలాగ్స్, వల్గర్ గా అనిపించే సన్నివేశాలతో ఇప్పటికే యూట్యూబ్ రచ్చగా మారింది. రొమాన్స్ డోస్ పెంచి, అసభ్య కరమైన డైలాగ్స్ ఉండే చిత్రాలని బోల్డ్ కంటెంట్ పేరుతో చిత్రీకరిస్తున్నారు. 

ఇటీవల 'ఏడు చేపలకథ' అనే చిత్ర హడావిడి చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర టీజర్స్, ట్రైలర్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఈ చిత్రంలో మేఘన చౌదరి, బిగ్ బాస్ 2 ఫేమ్ భాను శ్రీ నటించారు. వీరిద్దరూ రొమాంటిక్ సీన్స్ లో పోటీ పడి పెర్ఫామ్ చేశారు. భానుశ్రీ, ఇతర చిత్ర యూనిట్ చేసిన రాజకీయం వల్ల తన పాత్రని తగ్గించారని మేఘన చౌదరి కొన్ని రోజుల క్రితం ఆవేదన వ్యక్తం చేసింది. 

తాజాగా భానుశ్రీ ఓ ఇంటర్వ్యూలో ఏడు చేపలకథ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కూడా ఏడుచేపల కథ చిత్ర బాధితురాలినే అని భానుశ్రీ అంటోంది. చిత్ర యూనిట్ పై సంచలన ఆరోపణలు చేసింది. ఏడు చేపల కథ చిత్రం ఇంత వల్గర్ గా ఉంటుందంటే అసలు ఒప్పుకునేదాన్ని కాదని భానుశ్రీ అంటోంది. 

సినిమాలో అసభ్యకర సన్నివేశాలు ఇంత దారుణంగా ఉంటాయని మొదట నాకు చెప్పలేదు. నాకు చెప్పింది ఒకటి.. సినిమాలో తెరకెక్కించింది మరొకటి అని భానుశ్రీ మండిపడింది. కొందరిని ఈ చిత్రం ఆకర్షించినప్పటికీ.. మరికొందరు తీవ్రంగా విమర్శించారు. 

అమ్మాయిలపై అత్యాచారం, హత్య.. సైకోపై హీరోయిన్ యుద్ధం!

ఇదిలా ఉండగా బిగ్ బాస్ 3 షోపై వచ్చిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై కూడా భానుశ్రీ స్పందించింది. ఎవరూ ఎవరినీ దేనికోసమో బలవంతం చేయడం ఉండదు. పరస్పర అంగీకారం లేకుండా ఏదీ జరగదు. బిగ్ బాస్ 2లో తనకు ఎలాంటి కాస్టింగ్ కౌచ్ సంఘటనలు ఎదురుకాలేదని భానుశ్రీ తెలిపింది. 

విశాఖ కాఫీ తోటల్లో ఎన్టీఆర్, రాంచరణ్.. 'RRR' లేటెస్ట్ అప్డేట్!

నాని హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ సీజన్ 2లో భానుశ్రీ కంటెస్టెంట్ గా పాల్గొంది. బిగ్ బాస్ హౌస్ లో భానుశ్రీ వివాదాలు హాట్ టాపిక్ గా మారాయి.