యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం భీష్మ. క్రేజీ బ్యూటీ రష్మిక మందన ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఛలో ఫేమ్ వెంకీ కుడుముల ఈ చిత్రానికి దర్శకుడు. మాస్ మసాలా అంశాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఫిబ్రవరి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేశారు. 

ఇటీవల 'వాటే బ్యూటీ' అనే సాంగ్ ప్రోమోని రిలీజ్ చేయగా మిలియన్ల కొద్దీ వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. తాజాగా అదే పాట  లిరికల్ వీడియోని రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో రష్మిక, నితిన్ డాన్స్ తో అదరగొట్టబోతున్నట్లు అర్థం అవుతోంది. లిరికల్ సాంగ్ లో కూడా నితిన్ వేస్తున్న కొన్ని క్రేజీ మూవ్ మెంట్స్ చూపించారు. 

ఇక సాంగ్ మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. ఈ పాటకు కాసర్ల శ్యామ్ లిరిక్స్ అందించారు. మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. సింగర్స్ ధనుంజయ్, అమల చేబోలు ఈ పాటని మంచి జోష్ తో పాడారు. ఈ పాటలో రష్మికపై సరదాగా సెటైర్లు వేశారు. ఇటీవల రష్మిక నివాసంపై ఐటి అధికారులు దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని సాంగ్ లో వాడుకున్నారు. 'ఎండల్లో నువ్ తిరగొద్దే..సూర్యునికే చెమటట్టుద్దే ఇంతందాన్నే దాచొద్దే..ఇన్ కమ్ టాక్స్ రైడైపోద్దే' అంటూ సాగే సరదా లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. 

ఆమెని పెళ్లి చేసుకోను.. ప్రెస్ మీట్ పెట్టి హీరోయిన్ ని ఏకిపారేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్!

రీసెంట్ గానే ఈ చిత్ర షూటింగ్ కూడా ముగిసింది. ఈ నేపథ్యంలో నితిన్, రష్మిక, వెంకీ కుడుముల పరస్పరం అభినందనలు తెలుపుకున్నారు. రష్మిక సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ అందరికి కృతజ్ఞతలు తెలిపింది. దర్శకుడు వెంకీ కుడుముల తన కుటుంబ సభ్యుడితో సమానం అని పేర్కొంది. 

కాజల్ స్టన్నింగ్ ఫొటోస్.. కళ్ళు జిగేల్ మనేలా అందాల ధగధగలు!

దీనికి వెంకీ కుడుముల సరదాగా రష్మికకు రిప్లయ్ ఇచ్చాడు. 'నన్ను నీ ఫ్యామిలీ అని చెప్పొద్దే.. ఇన్ కమ్ టాక్స్ రైడైపొద్దే' అంటూ రష్మికపై సెటైర్లు వేశాడు. లిరికల్ సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి. 

హీరోలకే మైండ్ బ్లాక్.. మాస్ స్టెప్పులతో టాప్ లేపేసిన హీరోయిన్లు