కొద్ది సేపటి క్రితమే బండ్ల గణేష్ ని హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత కొంత కాలంగా ప్రముఖ నిర్మాత పీవీపీతో బండ్ల గణేష్ కు విభేదాలు నెలకొన్న సంగతి తెలిసిందే. గణేష్ పై పీవీపీ అనేక ఆరోపణలు చేశారు. 

ఎన్టీఆర్ నటించిన టెంపర్ చిత్ర విషయంలో ఆర్థికంగా తనని గణేష్ మోసం చేశాడని పివిపి కేసు నమోదు చేశారు. అలాగే అర్థరాత్రి అతడి మనుషులు తనని బెదిరించారని కూడా పీవీపీ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనితో పోలీసులు గణేష్ ని పలు సెక్షన్ ల కింద అరెస్ట్ చేయడం జరిగింది. 

బ్రేకింగ్: సినీ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్.. బయటపడ్డ మోసం!

కానీ గణేష్ మాత్రం తాను అరెస్ట్ అయినట్లు వస్తున్న వార్తలని ఖండించాడు. ఓ కేసు విషయంలో పోలీసులు తనని విచారణకు మాత్రమే పిలిచారని, చట్టంపై గౌరవంతో విచారణకు హాజరైనట్లు గణేష్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నాడు. 

బండ్ల గణేష్ అరెస్ట్ కు కారణం.. ఎన్టీఆర్ టెంపర్ మూవీ విషయంలో జరిగింది ఇదీ!

ఒకవేళ పోలీసులు నిజంగానే తనని అరెస్ట్ చేస్తే ఆ విషయం తానే చెబుతానని గణేష్ తెలిపాడు.