బండ్ల గణేష్ గబ్బర్ సింగ్ చిత్రంతో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా మారాడు. ఆ తర్వాత అతడి నిర్మాణంలో అనేక విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. ఇదిలా ఉండగా బండ్ల గణేష్ 2015లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో టెంపర్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ చిత్రం సూపర్ హిట్ అయింది. 

టెంపర్ చిత్రానికి సంబంధించిన ఆర్థిక లావాదేవీల విషయంలో బండ్ల గణేష్ చుక్కుల్లో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గత కొంతకాలంగా ప్రముఖ నిర్మాత పొట్లూరి వరప్రసాద్(పీవీపీ) కు బండ్ల గణేష్ కు మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. 

టెంపర్ చిత్రానికి పీవీపీ కోప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. ఓ ఫైనాన్షియర్, పీవీపీ కలసి టెంపర్ చిత్రానికి 30 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఈ డబ్బుని పీవీపీకి తిరిగి చెల్లించే క్రమంలో గొడవ మొదలయింది. తనకు రావాల్సిన డబ్బుని బండ్ల గణేష్ చెల్లించలేదంటూ పీవీపీ గతంలో కేసు నమోదు చేశారు. 

గణేష్ అనుచరులు కొందరు తన ఇంటికి వచ్చి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు కూడా పీవీపీ ఆరోపించారు. ఇటీవల అర్థరాత్రి బండ్ల గణేష్ అనుచరులు బెదిరింపులకు పాల్పడ్డారని పీవీపీ మరోమారు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనితో గణేష్ పై పోలీసులు సెక్షన్ 448, 420, 506 కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం బండ్ల గణేష్ ని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుస్తోంది. 

బ్రేకింగ్: సినీ నిర్మాత బండ్ల గణేష్ అరెస్ట్.. బయటపడ్డ మోసం!