Asianet News TeluguAsianet News Telugu

బాలయ్య పొలిటికల్ పంచ్ ఎవరిపై.. హాట్ టాపిక్ గా మారిన డైలాగ్

నందమూరి బాలకృష్ణ నటించిన తానా చిత్రం రూలర్. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

Balakrishna's Dialogue  from ruler trailer 2 is became hot topic
Author
Hyderabad, First Published Dec 15, 2019, 4:50 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

నందమూరి బాలకృష్ణ నటించిన తానా చిత్రం రూలర్. డిసెంబర్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 

శనివారం రోజు రూలర్ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ వేడుకని వైజాగ్ లో ఘనంగా నిర్వహించారు. రూలర్ చిత్ర యూనిట్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. కేఎస్ రవికుమార్ ఈ చిత్రంతో నందమూరి అభిమానులకు మాస్ ట్రీట్ అందించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. 

ఇదిలా ఉండగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రూలర్ మూవీ రెండవ ట్రైలర్ ని బోయపాటి శ్రీను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ని యూట్యూబ్ లో ఇంకా విడుదల చేయాల్సి ఉంది. ప్రీరిలీజ్ ఈవెంట్ లో రెండవ ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. 

రూలర్ ప్రీరిలీజ్: దానవీరశూర కర్ణ.. బాలయ్య కోసం వెయిటింగ్!

ఈ ట్రైలర్ లో బాలయ్య చెబుతున్న డైలాగ్స్ కు అభిమానుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా బాలయ్య చెప్పిన ఓ పొలిటికల్ డైలాగ్ హాట్ టాపిక్ గా మారింది. 'ఈ పొలిటికల్ పవర్ నువ్వు తీసుకున్న డిగ్రీ అనుకున్నావా చచ్చే వరకు నీతోనే ఉండడానికి.. ఎలక్షన్.. ఎలక్షన్ కి పవర్ కట్ అయిపోద్దిరా పోరంబోకు' అంటూ బాలయ్య చెబుతున్న డైలాగ్ సంచలనం సృష్టిస్తోంది. 

రూలర్ ప్రీరిలీజ్: బాలయ్య చిన్నప్పటి నుంచే.. చంద్రబాబుపై రాజశేఖర్ కామెంట్

ఎవరినైనా ఉద్దేశించి ఈ డైలాగ్ రాశారా అనే చర్చ అభిమానుల్లో, సినీ వర్గాల్లో జరుగుతోంది. 'గ్లోబుని గోళీలా.. గోళీలాగా చేసి పడుకున్న చోటి నుంచే ప్రపంచాన్ని చుట్టివచ్చేలా చేసిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు నీకు తాగుబోతుల్లా అనిపించారా' అని బాలయ్య చెబుతున్న మరో డైలాగ్ కూడా విశేషంగా ఆకట్టుకుంటోంది. 

సీకే ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న రూలర్ చిత్రంలో బాలయ్య సరసన సోనాల్ చౌహన్, వేదిక హీరోయిన్లుగా నటించారు. భూమిక కీలక పాత్రలో మెరిసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios